పాస్‌పోర్టు అపాయింట్‌మెంట్లు 50 శాతానికి తగ్గింపు

ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్‌లను 50శాతానికి కుదిస్తున్నట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు

Published : 19 Jan 2022 03:51 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు అపాయింట్‌మెంట్‌లను 50శాతానికి కుదిస్తున్నట్లు హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, పాస్‌పోర్టు లఘు కేంద్రాలు, పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల్లో ఈనెల 31వతేదీ వరకు 50 శాతం అపాయింట్‌మెంట్లు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఎవరికైనా మెడికల్‌, అత్యవసర ప్రయాణాలు ఉంటే సరైన డాక్యుమెంట్లతో పాస్‌పోర్టు కార్యాలయంలోని ప్రజా విచారణ కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.  ఈ కేంద్రం ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు మాత్రమే పనిచేస్తుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని