వరంగల్‌ నిట్‌ ఆధ్వర్యంలో వైజ్ఞానిక వారోత్సవాలు

ఆజాదీకా అమృతోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైజ్ఞానిక వారోత్సవాలను తెలుగులో నిర్వహించే బాధ్యతను వరంగల్‌ ఎన్‌ఐటీకి అప్పగించారు. హైదరాబాద్‌లోని నేషనల్‌

Published : 20 Jan 2022 06:01 IST

ఈనాడు, వరంగల్‌: ఆజాదీకా అమృతోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వైజ్ఞానిక వారోత్సవాలను తెలుగులో నిర్వహించే బాధ్యతను వరంగల్‌ ఎన్‌ఐటీకి అప్పగించారు. హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌, వరంగల్‌ ఎన్‌ఐటీలలో, విజయవాడ, విశాఖపట్నంలలో వీటిని కోలాహలంగా నిర్వహించేందుకు విజ్ఞాన్‌ప్రసార్‌ వారు ప్రణాళిక రూపొందించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నారు. 75 మంది శాస్త్రవేత్తల గురించి వివరిస్తారు. పలు పోటీలు నిర్వహిస్తారు.ఈ కార్యక్రమాన్ని వచ్చేనెల 22న దిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించి.. 75 కేంద్రాల వారితో ముచ్చటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని