
అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి
అఖిలపక్షం డిమాండ్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే జప్తు చేసి, తక్షణమే ఆ డబ్బులను అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని మక్దూంభవన్‌లో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో ఎన్.బాలమల్లేశ్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చాడ వెంకట్‌రెడ్డి(సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), మల్లు రవి(కాంగ్రెస్), గోవర్థన్(సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ), శ్రీధర్(తెజస) తదితరులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, సమస్యను పోరాటం ద్వారా పరిష్కరించుకోవాలని చాడ సూచించారు. సమస్యను పరిష్కరించకపోతే అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల ఓట్లు తమకు పడవనే భావన అధికార పార్టీకి రావాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజాసమస్యలను పట్టించుకోని పరిస్థితులను చూసి రాజకీయ పార్టీలు సిగ్గుపడాలని, ఈ విషయంపై గవర్నర్, సీఎం, సీఎస్‌ను కలిసి వినతిపత్రాలు అందజేయాలని మల్లు రవి కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.