
Published : 29 Jan 2022 04:23 IST
యూఎస్‌పీసీ ఉద్యమానికి మద్దతు
ఈనాడు, హైదరాబాద్: జీఓ 317 ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) చేపట్టిన ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ.. పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. యూఎస్‌పీసీ ఉద్యమానికి తాము కూడా మద్దతిస్తున్నట్లు తెజస అధ్యక్షుడు కోదండరాం ఓ ప్రకటనలో తెలిపారు.
Tags :