CM Jagan: కోర్టుకు హాజరు నుంచి ఏపీ సీఎం జగన్‌కు మినహాయింపు

ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు నుంచి ఏపీ ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డికి మినహాయింపు లభించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. 2014లో హుజూర్‌నగర్‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ

Updated : 30 Mar 2022 06:57 IST

ఎన్నికల నియమావళి కేసులో హైకోర్టు ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు నుంచి ఏపీ ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డికి మినహాయింపు లభించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. 2014లో హుజూర్‌నగర్‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ జగన్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై మంగళవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసులకు నోటీసులిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 26కు వాయిదా వేశారు. అప్పటివరకు కేసు విచారణలో జగన్‌కు హాజరు మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని