Uttam Kumar Reddy: త్రివిధ దళాధిపతులు మా బ్యాచ్‌ వాళ్లే: ఎంపీ ఉత్తమ్‌

దేశ భద్రతలో అత్యంత కీలకమైన పదాతి, వాయుసేన, నౌకాదళ అధిపతులు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)లో తన బ్యాచ్‌మేట్స్‌ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ....

Updated : 20 Apr 2022 08:01 IST

ఈనాడు, నల్గొండ: దేశ భద్రతలో అత్యంత కీలకమైన పదాతి, వాయుసేన, నౌకాదళ అధిపతులు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)లో తన బ్యాచ్‌మేట్స్‌ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దేశ 29వ సైన్యాధిపతిగా నియమితులైన లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌పాండే వచ్చేనెల 1న బాధ్యతలు చేపడతారు. ‘‘మనోజ్‌పాండే, భారతీయ వాయుసేన (ఐఏఎఫ్‌) ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ చౌధరి, నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ హరికుమార్‌, తాను 1979 జనవరి 1 నుంచి 1981 డిసెంబరు 31 వరకు ఎన్‌డీఏలో 61 కోర్సులో శిక్షణ పొందాం’’ అని ఉత్తమ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఒకే సమయంలో త్రివిధ దళాలకు తమ బ్యాచ్‌మేట్స్‌ నాయకత్వం వహించనుండడం గర్వించదగ్గ విషయమని, వారి చేతుల్లో దేశ భద్రత సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని