ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్‌ ఎత్తివేత

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఎత్తేసింది. నిఘా విభాగాధిపతిగా పని చేసిన సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 2020 ఫిబ్రవరి 8న రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండు చేసింది.

Published : 19 May 2022 05:27 IST

పోస్టింగ్‌ కోసం రిపోర్టు చేయాలని ఆదేశం

ఈనాడు, అమరావతి: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ను ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఎత్తేసింది. నిఘా విభాగాధిపతిగా పని చేసిన సమయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 2020 ఫిబ్రవరి 8న రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సస్పెండు చేసింది. ప్రతి 6 నెలలకు ఒకసారి దానిని పొడిగిస్తూ వచ్చింది. ఆయనపై వేటు వేసి ఈ ఏడాది ఫిబ్రవరి 8 నాటికి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ ఏప్రిల్‌ 22న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాని గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీతో ముగిసినందున సస్పెన్షన్‌ చెల్లదని పేర్కొంది. ఫిబ్రవరి 7 నుంచి ఆయన సర్వీసులో ఉన్నట్లు పరిగణించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించి సర్వీసులోకి తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేయగా అవి బుధవారం వెలుగుచూశాయి. పోస్టింగ్‌ కోసం సాధారణ పరిపాలనశాఖలో రిపోర్టు చేయాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని