5,571 పీఎస్‌హెచ్‌ఎం కొలువులకు పచ్చజెండా

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని 5,571 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) కొలువులను ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు(పీఎస్‌హెచ్‌ఎం)గా ఉన్నతీకరించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Published : 19 May 2022 05:27 IST

ఎస్‌జీటీ పోస్టుల ఉన్నతీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని 5,571 సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) కొలువులను ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు(పీఎస్‌హెచ్‌ఎం)గా ఉన్నతీకరించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన దస్త్రంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం సంతకం చేశారు. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో హెచ్‌ఎంల పోస్టులను 10 వేలకు పెంచుతామని దాదాపు ఏడాది క్రితం సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వాటిలో గతంలోనే 4,429 ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఉండగా.. మరో 5,571 పోస్టులను కొత్తగా మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే, కొత్త వాటిని మంజూరు చేయకుండా ఇప్పటికే ఉన్న ఎస్‌జీటీ కొలువులను పీఎస్‌హెచ్‌ఎంగా ఉన్నతీకరిస్తారు. దీంతో ఎస్‌జీటీ ఖాళీలు ఆ మేరకు తగ్గిపోనున్నాయి. ఉన్నతీకరణపై త్వరలోనే జీవో వెలువడనుంది. పీఎస్‌హెచ్‌ఎంల కొలువుల దస్త్రంపై సంతకం చేసిన మంత్రి హరీశ్‌రావుకు పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని