ప్రయాణికులు లేక 8 రైళ్ల రద్దు

కరోనా రెండోదశ ఉద్ధృతి, పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ప్రభావంతో రైలు ప్రయాణాలు తగ్గుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా ఉన్న రైళ్లను రైల్వేశాఖ దశలవారీగా తాత్కాలికంగా రద్దు చేస్తోంది.

Updated : 29 May 2021 07:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా రెండోదశ ఉద్ధృతి, పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ప్రభావంతో రైలు ప్రయాణాలు తగ్గుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా ఉన్న రైళ్లను రైల్వేశాఖ దశలవారీగా తాత్కాలికంగా రద్దు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 8 రైళ్లను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఇందులో 6 రైళ్లు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా రెండు దక్షిణమధ్య రైల్వేజోన్‌ మీదుగా రాకపోకలు సాగించేవి.
రద్దు చేసిన రైళ్లు.. విశాఖపట్నం-కాచిగూడ (నం.08561) జూన్‌ 1-10 వరకు, కాచిగూడ-విశాఖపట్నం (నం.08562) జూన్‌ 2-11, విశాఖపట్నం-కడప (నం..07488) జూన్‌ 1-10, కడప-విశాఖపట్నం (నం.07487) జూన్‌ 2-11, విశాఖపట్నం-లింగంపల్లి (నం.02831) జూన్‌ 1-10, లింగంపల్లి-విశాఖపట్నం (నం.02832) జూన్‌ 2-11, పుణె-భువనేశ్వర్‌(నం.02881) జూన్‌ 3-10, భువనేశ్వర్‌-పుణె(నం.02882) జూన్‌ 1-8 వరకు రద్దయ్యాయి.
వేసవి ప్రత్యేక రైళ్లు.. త్రివేండ్రం-మాల్దాటౌన్‌ (06185) రైలు జూన్‌ 1న, మాల్దాటౌన్‌-త్రివేండ్రం (06186) రైలు జూన్‌ 4న బయలుదేరుతాయి. ఈ రైళ్లు రాజమహేంద్రవరం, సామర్లకోట జంక్షన్‌ రైల్వేస్టేషన్లలో ఆగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని