తెలంగాణ బిడ్డల కోసమే స్థానిక రిజర్వేషన్లు

తెలంగాణ బిడ్డలకు ఎక్కువ ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా, జోనల్‌, రాష్ట్ర స్థాయిల్లో స్థానిక రిజర్వేషన్లు పెంచారని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. దీని వల్ల 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని, ఇంతకుముందు

Published : 27 Jun 2022 03:48 IST

 మూడేళ్లలో కేంద్రం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు: మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, న్యూస్‌టుడే: తెలంగాణ బిడ్డలకు ఎక్కువ ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా, జోనల్‌, రాష్ట్ర స్థాయిల్లో స్థానిక రిజర్వేషన్లు పెంచారని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. దీని వల్ల 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని, ఇంతకుముందు 40 శాతం మేర ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక అభ్యర్థులు పొందేవారని పేర్కొన్నారు. సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో శిక్షణ పొందుతున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఆదివారం స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క ఖాళీ లేకుండా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని అన్నారు. ‘‘అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి ఇస్తే నిరుద్యోగులకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో నెల, రెండు నెలలకు ఓ ఉద్యోగ ప్రకటన జారీ చేస్తున్నాం. గ్రూప్‌-1 తరవాత గ్రూప్‌-2, 3 నోటిఫికేషన్లు రానున్నాయి. పోలీసు ఉద్యోగ నియామకాలు పూర్తవగానే గ్రూప్‌-4 ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరానికి ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటిస్తాం. కేంద్ర ప్రభుత్వ పరిధిలో దేశంలో సుమారు 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భాజపా సర్కారు మూడేళ్లలో ఒక్కటీ భర్తీ చేయలేదు. వాటి భర్తీకి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఆ నియామకాలను చేపడితే కేంద్రం పరిధిలోని మరో లక్ష ఉద్యోగాలు తెలంగాణ విద్యార్థులకు వచ్చే అవకాశముంటుంది’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని