నూనె నాణ్యత నిర్ధారణకు నమూనాల సేకరణ

ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల కొనసాగింపులో భాగంగా కమిషనర్‌ శ్వేతామహంతి ఆదేశాలను అనుసరించి.. రాష్ట్రంలో వేర్వేరు నూనె ఉత్పత్తుల్లో నాణ్యతను నిర్ధారించడానికి

Published : 13 Aug 2022 04:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల కొనసాగింపులో భాగంగా కమిషనర్‌ శ్వేతామహంతి ఆదేశాలను అనుసరించి.. రాష్ట్రంలో వేర్వేరు నూనె ఉత్పత్తుల్లో నాణ్యతను నిర్ధారించడానికి నమూనాలను సేకరిస్తున్నట్లు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌(ఐపీఎం) సంచాలకురాలు శివలీల తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 60, మిగిలిన 32 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో రెండు చొప్పున 64 నమూనాలను.. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 124 రకాల ఆహారంలో వినియోగించే నూనెల నమూనాలను సేకరిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం నాటికి 108 నూనె నమూనాలను సేకరించామని, మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. సేకరించిన నమూనాలను నిర్ధారణ పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని