గిరిజన రిజర్వేషన్లు ఇక 10 శాతం

రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు (జీవో నెం.33) జారీ చేసింది. చెల్లప్ప కమిషన్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని.. వారికి రిజర్వేషన్లను పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది...

Updated : 01 Oct 2022 07:48 IST

విద్య, ఉద్యోగాల్లో తక్షణ అమలు
ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
64 శాతానికి చేరిన రిజర్వేషన్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఉత్తర్వులు (జీవో నెం.33) జారీ చేసింది. చెల్లప్ప కమిషన్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని.. వారికి రిజర్వేషన్లను పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. విద్య, ప్రభుత్వోద్యోగ నియామకాల్లో గిరిజనులకు ఈ రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో విద్య, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు 64 శాతానికి చేరాయి. ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు (ఎ గ్రూపు-7, బి-10, సి-1, డి-7, ఇ-4) 29, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. సీఎం శుక్రవారం యాదాద్రి పర్యటన ముగించుకొని ప్రగతిభవన్‌కు వచ్చిన వెంటనే ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై సమీక్ష సమావేశం నిర్వహించి ఆమోదం తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని