2జీ కూడాలేని 390 గ్రామాలకు నేరుగా 4జీ

రాష్ట్రంలో నెట్‌వర్క్‌ విస్తరణ దిశగా భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) అడుగులేస్తోంది.

Published : 30 Nov 2022 03:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నెట్‌వర్క్‌ విస్తరణ దిశగా భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) అడుగులేస్తోంది. ఇంతకాలం 3జీ కాదు కదా కనీసం 2జీ కూడా లేని గ్రామాలకు ఇప్పుడు నేరుగా 4జీ నెట్‌వర్క్‌ రాబోతుంది. తెలంగాణలో ఆ గ్రామాలు 390 ఉన్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ గుర్తించింది. ఒక్కో గ్రామంలో నెట్‌వర్క్‌ వసతుల కల్పనకు రూ.18 లక్షలు ఖర్చు చేయబోతుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ రివైవల్‌ 2.0లో భాగంగా దేశవ్యాప్తంగా 26 వేల గ్రామాల్లో నేరుగా 4జీని ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలోనూ ఇప్పటివరకు నెట్‌వర్క్‌ లేని గ్రామాలను ఉమ్మడి జిల్లాల వారీగా గుర్తించింది. వీటిలో 60 శాతం గ్రామాలు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే ఉన్నాయి. ఈ జిల్లాలో ఇప్పటికే 277 మొబైల్‌ టవర్లుండగా కొత్తగా 158 ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత ఉమ్మడి వరంగల్‌లో ఎక్కువ గ్రామాలున్నాయి. ఇక్కడ 312 టవర్లు ఉండగా కొత్తగా 46 వేస్తారు. ఉమ్మడి ఖమ్మంలో 246 టవర్లుండగా 40 కొత్తవి వేస్తారు. వచ్చే ఏడాది ఆఖరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా నెట్‌వర్క్‌ విస్తరణకు బీఎస్‌ఎన్‌ఎల్‌ కేబుల్‌, ఎక్విప్‌మెంట్‌తో కలిపి రూ.100 కోట్ల వరకు వ్యయం చేయబోతున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలంగాణ సర్కిల్‌ సీజీఎం కె.వి.ఎన్‌.రావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని