సౌత్‌జోన్‌ డీసీపీగా స్నేహామెహ్రా

హైదరాబాద్‌లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు.

Published : 26 Apr 2024 03:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ డీసీపీగా పనిచేశారు. సౌత్‌జోన్‌ డీసీపీగా ఉన్న సాయిచైతన్యను ఈసీ సూచన మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బదిలీ చేశారు. ఆయనకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులు అప్పగించొద్దని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు