ఖానాపూర్‌ అడవుల్లో చిరుత సంచారం

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి.

Published : 26 Apr 2024 03:20 IST

ఖానాపూర్‌, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాసర్‌పిట్‌లు, నీటి గుంతల వద్దకు దాహం తీర్చుకొనేందుకు వన్యప్రాణులు తరలివచ్చాయి. ఈ చిత్రాలు అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లకు చిక్కాయి. చిరుతపులి, ఎలుగుబంట్లు, ఏదులు, సాంబారు, అడవి దున్నలు, చుక్కల దుప్పులతోపాటు ఇతర జంతువుల చిత్రాలు చిక్కాయని ఎఫ్‌ఆర్వో వినాయక్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని