రెరా అథారిటీని నియమించండి

రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ చట్టం(రెరా) అమల్లోకి వచ్చి నాలుగన్నరేళ్లయినా పూర్తి స్థాయిలో రెరా అథారిటీని ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని సుపరిపాలన వేదిక (ఎఫ్‌జీజీ) పేర్కొంది.

Published : 02 Dec 2022 04:27 IST

సీఎంకు సుపరిపాలన వేదిక లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ చట్టం(రెరా) అమల్లోకి వచ్చి నాలుగన్నరేళ్లయినా పూర్తి స్థాయిలో రెరా అథారిటీని ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని సుపరిపాలన వేదిక (ఎఫ్‌జీజీ) పేర్కొంది. స్థిరాస్తి కొనుగోలుదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రెరా అథారిటీని నియమించాలని ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి గురువారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రెరా అమల్లోకి వచ్చిన ఏడాదిలోపు పూర్తిస్థాయిలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇప్పటికీ కాలేదన్నారు. అథారిటీ ఛైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించాల్సి ఉండగా మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ రెగ్యులేటరీ అధికారిగా కొనసాగుతున్నారని తెలిపారు. సీఎస్‌ విధులతో పాటు అయిదారు ప్రధాన శాఖల ఇన్‌ఛార్జిగా ఆయన కొనసాగుతుండటంతో రెరా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందన్నారు. పూర్తి స్థాయి రెరా అథారిటీతో పాటు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని