సంక్షిప్త వార్తలు(2)

వివిధ ప్రభుత్వ శాఖల నుంచి నిబంధనల సడలింపులు, మినహాయింపుల కోసం వచ్చిన సిఫార్సులను పరిశీలించి తుది నిర్ణయాన్ని సూచించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఆదివారం ఏర్పాటు చేసింది.

Updated : 05 Dec 2022 05:40 IST

నిబంధనల సడలింపుల పరిశీలనకు ఉన్నతస్థాయి కమిటీ
ప్రభుత్వ ఉత్తర్వులు

ఈనాడు,హైదరాబాద్‌: వివిధ ప్రభుత్వ శాఖల నుంచి నిబంధనల సడలింపులు, మినహాయింపుల కోసం వచ్చిన సిఫార్సులను పరిశీలించి తుది నిర్ణయాన్ని సూచించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఆదివారం ఏర్పాటు చేసింది. పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అథర్‌సిన్హా దీనికి ఛైర్మన్‌గా ఉంటారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన, వైద్యఆరోగ్య, న్యాయశాఖ కార్యదర్శులు సభ్యులుగా, జీఏడీ ఉపకార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పలు సేవాపరమైన అంశాలు, క్రమశిక్షణ చర్యలు, ఇతర నిబంధనల విషయంలో సడలింపులు, మినహాయింపులు కోరుతూ శాఖలు విడివిడిగా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తున్నాయి. వీటిలో కొన్ని వివాదాస్పదమైనవి ఉంటున్నాయి. వాటి విషయంలో సమగ్ర పరిశీలన జరిపి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదేని శాఖ నుంచి సిఫార్సు వస్తే ఈ కమిటీ సమావేశమై  చర్చిస్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది.


నేడు, రేపు పొడివాతావరణం

ఈనాడు, హైదరాబాద్‌: ఆగ్నేయ భారత ప్రాంతాల నుంచి పొడిగాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. వీటి ప్రభావంతో తెలంగాణలో సోమ, మంగళవారాల్లో మధ్యాహ్నం పొడివాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా ఆరేడు డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నందున పలు ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని