ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్‌ బస్సులు

టీఎస్‌ఆర్టీసీ తొలిసారి ప్రవేశపెడుతున్న 16 ఏసీ స్లీపర్‌ బస్సులకు హైటెక్‌ హంగులు జోడించింది. ప్రయాణికులకు ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందిస్తున్నట్లు తెలిపింది.

Updated : 27 Mar 2023 04:22 IST

నేడు ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ తొలిసారి ప్రవేశపెడుతున్న 16 ఏసీ స్లీపర్‌ బస్సులకు హైటెక్‌ హంగులు జోడించింది. ప్రయాణికులకు ఉచిత వై-ఫై సౌకర్యాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. ఈ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సోమవారం హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో ప్రారంభించనున్నారు. టీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఇటీవల ప్రారంభించిన 12 నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సుల మాదిరిగానే వీటికీ ‘లహరి- అమ్మఒడి అనుభూతి’గా సంస్థ నామకరణం చేసింది. ప్రయాణికులకు సోమవారం నుంచే ఇవి అందుబాటులోకి వస్తాయి. విశాఖపట్నం, తిరుపతి, చెన్నై, బెంగళూరు, హుబ్బళ్లి మార్గాల్లో నడపనున్నట్లు సంస్థ తెలిపింది.

ఇవీ సదుపాయాలు

* ప్రయాణికుల భద్రతకు బస్సు ట్రాకింగ్‌ సిస్టంతో పాటు బస్సులో ‘పానిక్‌ బటన్‌’ సదుపాయం కల్పించారు. ప్రతి బస్సుకు రివర్స్‌ పార్కింగ్‌ అసిస్టెన్స్‌ కెమెరా ఉంటుంది.

* బస్సు లోపల సెక్యూరిటీ కెమెరాలు, ఫైర్‌ డిటెక్షన్‌- అలారం సిస్టం (ఎఫ్‌డీఏఎస్‌) ఏర్పాటు చేశారు. ప్రమాదవశాత్తు బస్సులో మంటలు చెలరేగితే ఫైర్‌ డిటెక్షన్‌ అప్రమత్తం చేస్తుంది. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం ఉంటుంది.

* 12 మీటర్ల పొడవుండే ఈ బస్సుల్లో లోయర్‌ 15, అప్పర్‌ 15 కలిపి 30 చొప్పున బెర్తులు ఉంటాయి. ప్రతి బెర్త్‌కు మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సౌకర్యం, రీడింగ్‌ ల్యాంప్‌ ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు