రాష్ట్రంలో ఏడు చోట్ల ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు

ఆహారం, వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో ఆహార శుద్ధి పరిశ్రమల (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) జోన్లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎ.శాంతికుమారి పేర్కొన్నారు.

Published : 01 Apr 2023 04:49 IST

సమీక్షలో సీఎస్‌ శాంతికుమారి

ఈనాడు, హైదరాబాద్‌: ఆహారం, వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో ఆహార శుద్ధి పరిశ్రమల (ఫుడ్‌ ప్రాసెసింగ్‌) జోన్లను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎ.శాంతికుమారి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఏడు ప్రాంతాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల ఏర్పాటు, వాటి ప్రోత్సాహానికి అవసరమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆమె ఆదేశించారు. రాష్ట్రంలో ప్రత్యేక ఆహార శుద్ధి పరిశ్రమల జోన్ల ఏర్పాటు, సాధించిన పురోగతిపై శుక్రవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో పరిశ్రమల శాఖ అధికారులతో సీఎస్‌ సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లలో రైస్‌మిల్లుల ఏర్పాటుకు భూముల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. మిడ్‌ మానేరు రిజర్వాయరులో ఆక్వా హబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు