డీఈఈసెట్‌కు 79% మంది హాజరు

రెండేళ్ల డీఈడీ కోర్సులో చేరేందుకు రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిర్వహించిన డీఈఈసెట్‌కు 79.40 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Published : 02 Jun 2023 04:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: రెండేళ్ల డీఈడీ కోర్సులో చేరేందుకు రాష్ట్రవ్యాప్తంగా గురువారం నిర్వహించిన డీఈఈసెట్‌కు 79.40 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనికి మొత్తం 6,485 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 5,144 మంది పరీక్ష రాశారని కన్వీనర్‌ శ్రీనివాసాచారి తెలిపారు. పరీక్ష ప్రాథమిక ‘కీ’ను ఈ నెల 5వ తేదీలోపు విడుదల చేస్తామని చెప్పారు. ఫలితాలను 10 రోజుల్లోపు వెల్లడిస్తామన్నారు.

పీజీఈసెట్‌కు 90 శాతం..

ఎంటెక్‌, ఎంఫార్మసీ తదితర కోర్సుల్లో చేరేందుకు తెలంగాణలో నిర్వహించిన పీజీఈసెట్‌కు 89.85 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు 16,563 మంది దరఖాస్తు చేసుకోగా 14,882 మంది రాశారని కన్వీనర్‌ రవీంద్రారెడ్డి తెలిపారు.


తెలంగాణ వర్సిటీ సెలవులు రద్దు

డిచ్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని మెయిన్‌ క్యాంపస్‌, సౌత్‌ క్యాంపస్‌, సారంగపూర్‌ కళాశాలల విద్యార్థులకు బుధవారం ప్రకటించిన సెలవులను రద్దు చేస్తున్నట్లు వీసీ రవీందర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.విద్యార్థులకు యథావిధిగా హాస్టల్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని