అటవీ చట్టం ఉల్లంఘనలపై కోర్టుల్లో ఫిర్యాదు చేయండి: కేంద్రం ఆదేశం

అడవుల్లో అటవీ సంరక్షణ చట్టం ఉల్లంఘనలు, నేరాలు జరిగితే జిల్లా అటవీ అధికారులు, డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, ఆపై స్థాయి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆదేశించింది.

Published : 07 Jun 2023 03:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: అడవుల్లో అటవీ సంరక్షణ చట్టం ఉల్లంఘనలు, నేరాలు జరిగితే జిల్లా అటవీ అధికారులు, డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, ఆపై స్థాయి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు న్యాయస్థానాల్లో ఫిర్యాదు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆదేశించింది. ఈ మేరకు మార్చి 24న జరిగిన సలహా కమిటీ సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలను ఆమోదించింది. డీఎఫ్‌ఓలు, డీసీఎఫ్‌లు తమ పరిధిలో అటవీ నేరాలు జరిగితే నేరం చేసిన వారిపై ఫిర్యాదు చేయాలంది. కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందితే, పరిశీలన తర్వాత ఆయా వివరాలను పంపిస్తామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని