తెలంగాణలో ఈ నెల 18 నుంచి మళ్లీ వర్షాలు!

బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఈ నెల 16న గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.

Published : 15 Jul 2023 05:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతం వాయవ్య ప్రాంతంలో ఈ నెల 16న గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఇది తీవ్రమైతే ఈ నెల 18 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడే సూచనలున్నట్లు చెప్పారు. శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రపై 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. శుక్రవారం స్వల్పంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా గూడూరు(జనగామ జిల్లా)లో 2.5, లోకరి(ఆదిలాబాద్‌)లో 2.3 సెంటీమీటర్లు కురిసింది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 డిగ్రీలు అదనంగా పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం అత్యధికంగా నల్గొండ జిల్లా దామెరచర్లలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు