గనుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి!

ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మంత్రిగా గురువారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు.

Published : 25 Aug 2023 04:53 IST

సమాచార, పౌర సంబంధాల శాఖలూ..
ప్రమాణ స్వీకారానికి హాజరైన అనంతరం గవర్నర్‌తో సీఎం భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మంత్రిగా గురువారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం గవర్నర్‌, సీఎం కేసీఆర్‌ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు, మహేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మహేందర్‌రెడ్డికి గనులు, భూగర్భ వనరులు, సమాచార, పౌర సంబంధాల శాఖలను కేటాయిస్తున్నట్టుగా గవర్నర్‌ కార్యాలయానికి ప్రభుత్వం సమాచారం పంపినట్టుగా తెలిసింది. సంబంధిత ఉత్తర్వులు శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది.


గవర్నర్‌తో సీఎం భేటీ

ప్రమాణ స్వీకర కార్యక్రమం అనంతరం గవర్నర్‌ ఇచ్చిన తేనీటి విందులో ముఖ్యమంత్రి సహా మంత్రులు పాల్గొన్నారు. తర్వాత మంత్రిమండలి సభ్యులందరూ కలిసి గవర్నర్‌తో ఫొటో దిగారు. ఈ సందర్భంగా కొద్దిసేపు సీఎం  గవర్నర్‌ తమిళిసైతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన 12 బిల్లులతోపాటు, ఇద్దరు ఎంఎల్‌సీల నియామక ప్రక్రియ ఇంకా కొలిక్కిరాని నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు