Vande Bharat Express: సికింద్రాబాద్‌కు ఆలస్యంగా వందేభారత్‌

విశాఖపట్నం నుంచి వచ్చే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ శనివారం ఆలస్యంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంది.

Updated : 26 Nov 2023 07:44 IST

ఈ రైలు వచ్చే పట్టాలపైకి విశాఖ ఎల్‌టీటీ
ప్లాట్‌ఫాం నిర్వహణలో ద.మ.రైల్వే నిర్లక్ష్యం

ఈనాడు, హైదరాబాద్‌: విశాఖపట్నం నుంచి వచ్చే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) శనివారం ఆలస్యంగా సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంది. విశాఖపట్నం నుంచి శనివారం ఉదయం బయల్దేరిన ఈ రైలు మధ్యాహ్నం 2.15కి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకోవాలి. అయితే మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చి వెళ్లాల్సిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ 1.58 గంటలకు పదో నంబరు ప్లాట్‌ఫాం మీదకు వచ్చింది. దీంతో ఆ ప్లాట్‌ఫాం మీదకు రావాల్సిన వందేభారత్‌ అరగంటపాటు ఔటర్‌లో నిరీక్షించి ఆ రైలు వెళ్లాక సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకుంది. అధిక ఛార్జీలు తీసుకుంటూ రైలును ఆలస్యంగా నడపడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సికింద్రాబాద్‌ స్టేషన్‌ మేనేజర్‌ రాజనర్సు మాట్లాడుతూ.. ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌ను మధ్యాహ్నం 2.12 గంటలకు పంపించామని, ఆ వెంటనే వందేభారత్‌ వచ్చిందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని