EPFO: నెల రోజుల్లో ‘అధిక వేతన పింఛను’

అధిక వేతన పింఛను ప్రక్రియ నెల రోజుల్లో ప్రారంభమవుతుందని అడిషనల్‌ సెంట్రల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ వైశాలి దయాళ్‌ స్పష్టం చేశారు.

Updated : 30 Jan 2024 09:31 IST

ఏసీపీఎఫ్‌ కమిషనర్‌ వైశాలి దయాళ్‌

రాయదుర్గం, న్యూస్‌టుడే: అధిక వేతన పింఛను ప్రక్రియ నెల రోజుల్లో ప్రారంభమవుతుందని అడిషనల్‌ సెంట్రల్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ వైశాలి దయాళ్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వర్చూసా సాఫ్ట్‌వేర్‌ సంస్థలో సోమవారం ఈపీఎఫ్‌ఓ ఆధ్వర్యంలో నిధి ఆప్‌ కే నికట్‌(నిధి మీ చెంతకే) 2.0 కార్యక్రమం నిర్వహించారు. వివిధ ఐటీ సంస్థల ఉద్యోగులు హాజరయ్యారు. భవిష్యనిధి(పీఎఫ్‌)కి సంబంధించిన వారి సందేహాలను ఆమె నివృత్తి చేశారు. ఈ సందర్భంగా వైశాలి దయాళ్‌ మాట్లాడుతూ ప్రతి నెల 27వ తేదీన నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మొదటి ఏడాది పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని జరుపుతున్నామన్నారు. ఈపీఎఫ్‌ సభ్యుల సమస్యల పరిష్కారానికి వారి వద్దకే అధికారుల బృందం వెళ్లేలా నిధి ఆప్‌ కే నికట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అధిక వేతన పింఛను అర్జీలను స్వీకరించామని, ప్రక్రియను నెల రోజుల్లో ప్రారంభించి పెన్షన్లు విడుదల చేస్తామని తెలిపారు. 2014 సెప్టెంబరు నుంచి వేతనం రూ.15 వేలు దాటిన వారికి పింఛను పథకం కింద సభ్యత్వం ఇవ్వడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో రీజినల్‌ పీఎఫ్‌ కమిషనర్‌ వివేక్‌ రామన్‌రెడ్డి, అసిస్టెంట్‌ పీఎఫ్‌ కమిషనర్‌ జె.శ్రీనివాస్‌, వర్చూసా సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ వాజు పెండ్యాల, సెంటర్‌ హెడ్‌ కృష్ణ యెదుల తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని