గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Published : 20 Apr 2024 04:37 IST

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణంలోని శాస్త్రీనగర్‌లో నిర్వహిస్తున్న గురుకులంలో మొత్తం 350 మంది విద్యార్థులున్నారు. గురువారం ఉదయం అల్పాహారంగా బోండాలు అందించారు. అనంతరం 25 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కాగా సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కోలుకున్న విద్యార్థులను శుక్రవారం తిరిగి గురుకులానికి తరలించారు.  బోండాల తయారీలో అధిక నూనె వాడటం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ప్రిన్సిపల్‌ సత్యప్రసాద్‌ రాజుతెలిపారు. 

కేజీబీవీ విద్యార్థినులకు కడుపునొప్పి.. 11 మంది ఆస్పత్రికి తరలింపు

నర్సాపూర్‌(జి), న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి) మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 11 మంది విద్యార్థినులకు కడుపునొప్పి రావడంతో శుక్రవారం స్థానిక ప్రభుత్వఆసుపత్రిలో చేర్పించారు.  సమాచారమివ్వడంతో ఆ 8 మంది విద్యార్థినులను వారి తల్లిదండ్రులు తీసుకెళ్లారన్నారు. గతంలో ఈ పాఠశాలలోనే 32 మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని