4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..

రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి.

Updated : 28 Apr 2024 05:47 IST

ఉడికిపోయిన కరీంనగర్‌, నల్గొండ, ములుగు, జగిత్యాల
సూర్యాపేట జిల్లాలో వడదెబ్బతో ఒకరి మృతి
నేడు ఈదురుగాలులు.. రేపు, ఎల్లుండి ఉక్కపోత

ఈనాడు, హైదరాబాద్‌- అనంతగిరి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. అత్యధికంగా కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలో 45.4 డిగ్రీలుగా నమోదైంది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి, ములుగు జిల్లా మంగపేట మండలాల్లో 45.2, ములుగు జిల్లా వాజేడు, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలాల్లో 45.1 డిగ్రీల చొప్పున ఉంది. మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో 44.5 నుంచి 44.9 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. హైదరాబాద్‌ పరిధిలోని మూసాపేటలో గరిష్ఠంగా 43 డిగ్రీల ఎండ కాసింది. 21 సర్కిళ్లలో 42.1 నుంచి 42.9 డిగ్రీల మధ్య నమోదైంది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో కొత్తగోల్‌తండాకు చెందిన కూలీ బాణోతు మంగ్యా(40) వడదెబ్బకు గురై..ఆసుపత్రికి తరలించేలోపే మృతిచెందారు. ఆది, సోమవారాల్లోనూ ఎండ తీవ్రత కొనసాగుతుందని, పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని