మహబూబాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాం నాయక్‌కు మాతృవియోగం

మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్‌ మాతృ వియోగం పొందారు.

Published : 05 May 2024 04:34 IST

హైదరాబాద్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాం నాయక్‌ మాతృ వియోగం పొందారు. ఆయన తల్లి లక్ష్మీబాయి(100) అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్‌లోని అరవింద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ములుగు జిల్లా మదనపల్లికి చెందిన లక్ష్మీబాయి, లచ్చూనాయక్‌ దంపతులకు ఐదుగురు సంతానం. ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కుమారులు. బలరాంనాయక్‌ రెండో కుమారుడు. భద్రాద్రిజిల్లా కొత్తగూడెంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారసభలో ఉన్న బలరాంనాయక్‌ తల్లి మృతి చెందిన విషయం తెలియగానే వెంటనే హనుమకొండకు వెళ్లారు. ఈ నెల 5న ఆదివారం(నేడు) హనుమకొండలో దహన సంస్కారాలు జరుగుతాయని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా లక్ష్మీబాయి మృతి పట్ల పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క తదితరులు వేర్వేరు ప్రకటనల్లో లక్ష్మీబాయి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని