Women Billionaires: నవలక్ష్ములు!

ఇంటినే కాదు, వ్యాపారాలనూ.. చక్కబెట్టి కోటీశ్వరులవుతున్న వారిలో మహిళల శాతం పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Published : 15 Mar 2023 00:01 IST

ఇంటినే కాదు, వ్యాపారాలనూ.. చక్కబెట్టి కోటీశ్వరులవుతున్న వారిలో మహిళల శాతం పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సిటీ ఇండెక్స్‌ సంస్థ ప్రపంచంలోని ధనిక మహిళలపై ఓ అధ్యయనం చేసి ఆసక్తికరమైన విషయాలని చెప్పింది. కోట్లకు పడగలెత్తిన మహిళల్లో ఎక్కువమంది అమెరికాలోనే ఉన్నారట. రెండోస్థానంలో చైనా... మూడో స్థానంలో జర్మనీ ఉన్నాయి. ఇక మనదేశం తొమ్మిదిమంది కోటీశ్వరలమ్మలతో అయిదోస్థానంలో ఉంది. మరి మొదటి స్థానంలో ఎవరున్నారా ఆలోచిస్తున్నారా? లోరియల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఫ్రాంకాయిస్‌ బెటెన్‌కోర్ట్‌ 80 కోట్ల డాలర్ల ఆస్తితో మొదటిస్థానంలో ఉన్నారు. ఇక స్వశక్తితో ఎదిగిన ఆడవాళ్ల జాబితా తీస్తే.. 6.6 కోట్ల డాలర్ల ఆస్తితో హాంకాంగ్‌ టెక్‌ అధినేత్రి ఝో క్వున్‌ఫీ ఉన్నారు. ఇక మన దేశంలో.. వ్యాపారవేత్త సావిత్రి జిందాల్‌ ముందు వరుసలో ఉన్నారు. లీనా తివారీ, ఫల్గుణి నాయర్‌, స్మిత క్రిష్ణ, అనూఆగా, కిరణ్‌ మజూందార్‌ షా వంటివారంతా వరసగా మనదేశంలో కోట్లకు పడగలెత్తిన మహిళామణులే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇలా ప్రతి దేశంలోనూ సగటున తొమ్మిదిమంది లక్ష్మీదేవిలున్నారట..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్