టెడ్డీబేర్‌ తోడు...

పసిపిల్లల నుంచి ప్రేమికుల వరకూ అందరి హృదయాలనూ హత్తుకోగల అపురూపమైన కానుక టెడ్డీబేర్‌. ఒంటరితనాన్ని తగ్గించి మనసుకి సాంత్వన అందించే దీని గురించి తెలుసుకుందామా!

Published : 10 Feb 2023 00:47 IST

పసిపిల్లల నుంచి ప్రేమికుల వరకూ అందరి హృదయాలనూ హత్తుకోగల అపురూపమైన కానుక టెడ్డీబేర్‌. ఒంటరితనాన్ని తగ్గించి మనసుకి సాంత్వన అందించే దీని గురించి తెలుసుకుందామా!

పేద్ద తల, చిన్ని కళ్లు, గుండ్రటి ముక్కు, చూడగానే హత్తుకోవాలనిపించే సుతిమెత్తని రూపం ఉన్న టెడ్డీబేర్‌ని ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. నిజానికి ఇది ఒక ఎలుగుబంటి బొమ్మ. వాలెంటైన్స్‌ వీక్‌లో నాలుగో రోజు టెడ్డీ డేను జరుపుకొంటారు.  ఇదొక స్ట్రెస్‌ బాల్‌ లాంటిదట. ఉరుకులు పరుగుల జీవితంలో కలిగే ఒత్తిడి ఆందోళన, కుంగుబాటు, ఒంటరితనం వంటి మానసిక అనారోగ్యాలు.. దీన్ని హత్తుకుంటే చాలు ఉఫ్‌ మన్నట్లే మాయమవుతాయట.  అంటే శరీరానికి ఔషధం పనిచేసినట్లు మనసుకు ఈ బొమ్మలు సాంత్వన అందిస్తాయని అధ్యయనాలూ చెబుతున్నాయి.

ఒంటరితనంలో.. ప్రేమ విఫలమైందనో, అయినవారంతా దూరంగా ఉన్నారనో.. అనిపించినప్పుడు కాసేపు దాంతో కబుర్లు చెప్పండి. ఆ బాధ తగ్గుతుంది. పని ఒత్తిడితో అలసి ఇంటికి చేరుకున్నప్పుడు టెడ్డీని చూడగానే మనసెంతో ఆహ్లాదంగా మారుతుందని సెలబ్రిటీలూ చెబుతున్నారు. మరికొందరైతే కొవిడ్‌ సమయంలో తమ ఒంటరితనాన్ని ఇవి పంచుకొన్నట్లుగా అనిపించిందన్నారు. ఇంకొందరైతే చదువు, ఉద్యోగాలంటూ  ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు తమకు అత్యంత ఆత్మీయుడిగా ఈ బొమ్మ నిలిచిందంటున్నారు. అంతేకాదు, ఇవి సామాజికపరమైన ఆందోళనను తగ్గిస్తూ, హార్మోన్ల స్థాయినీ సమన్వయం చేస్తున్నాయట. సాధారణ అమ్మాయిల నుంచి సెలబ్రిటీల వరకూ.. ఇది బొమ్మ కాదు. తమ మనసుకు అతిదగ్గరైన స్నేహితురాలంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్