కొబ్బరిపాలతో వృద్ధాప్యఛాయలు దూరం..

విటమిన్లు, ఖనిజలవణాలు మెండుగా ఉండే కొబ్బరిపాలు వృద్ధాప్యఛాయలు త్వరగా రానివ్వకుండా చర్మాన్ని పరిరక్షిస్తాయి. శిరోజాలకూ ఈ పాలు ఔషధంలా మారి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

Published : 24 Dec 2022 00:14 IST

విటమిన్లు, ఖనిజలవణాలు మెండుగా ఉండే కొబ్బరిపాలు వృద్ధాప్యఛాయలు త్వరగా రానివ్వకుండా చర్మాన్ని పరిరక్షిస్తాయి. శిరోజాలకూ ఈ పాలు ఔషధంలా మారి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

పాలల్లో ఉండే సెలీనియం యూవీ కిరణాల ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుతుంది. వృద్ధాప్యఛాయలను త్వరగా రానివ్వకుండా అడ్డుపడుతుంది. పిగ్మెంటేషన్‌ మచ్చలను తగ్గిస్తుంది. ఇందుకోసం రెండు చెంచాల బాదం పేస్టుకి కొన్ని  కొబ్బరిపాలను కలిపి ముఖానికి పూత వేయాలి. అరగంటాగి చన్నీళ్లతో కడిగేస్తే చాలు ఫలితం ఉంటుంది. ఇలా వారానికి రెండు సార్లయినా చేయాలి.

చర్మం పొడారుతున్నప్పుడు... కప్పు ఓట్‌మీల్‌ పౌడర్‌కు పావుకప్పు కొబ్బరిపాలను కలిపి ఒంటికి రాసి రుద్దాలి. రెండుమూడు రోజులకొకసారి ఇలా చేస్తే చర్మరంధ్రాలు శుభ్రపడతాయి. మొటిమలు తగ్గుతాయి. ఇందుకోసం టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి పాలకు చెంచా గులాబీనీటిని కలిపి దానిలో ముంచిన దూదితో ముఖాన్ని తుడిస్తే చాలు. ఇలా బయటికి వెళ్లొచ్చిన ప్రతిసారీ చేస్తే సరి.

కొబ్బరి పాలు.. జుట్టుకు కావాల్సిన పోషకాలనూ, మృదుత్వాన్నీ అందిస్తాయి. సహజసిద్ధమైన కండిషనర్‌గానూ పనిచేస్తాయి. కప్పు కొబ్బరిపాలను ఫ్రిజ్‌లో రాత్రంతా ఉంచి వాటిని ఉదయాన్నే జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు రాయాలి. మృదువుగా మర్దనా చేసి అరగంట ఆరనిచ్చి తలస్నానం చేయాలి. వారానికొకసారి ఇలా చేస్తే, చుండ్రు, దురద వంటి సమస్యలు దూరమై, మెరిసే ఒత్తైన, పొడవైన జుట్టు సొంతమవుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్