Cool Drinks: మేలు చేసే పానీయాలు...

ఎండాకాలం టీ, కాఫీలకు బదులుగా మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగడం మామూలే. వాటితో పాటు ఈ పానీయాలూ ప్రయత్నించండి. భిన్నమైన రుచులే కాదు వేడి నుంచీ ఉపశమనం కలిగిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి..

Published : 24 May 2023 00:49 IST

ఎండాకాలం టీ, కాఫీలకు బదులుగా మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగడం మామూలే. వాటితో పాటు ఈ పానీయాలూ ప్రయత్నించండి. భిన్నమైన రుచులే కాదు వేడి నుంచీ ఉపశమనం కలిగిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి..


జల్‌జీరా

జీలకర్ర పొడి, పుదీనా పేస్టు, అల్లం ముద్ద, మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం, తగినంత ఉప్పు కలిపిన నీళ్లలో కాస్త బూందీ వేస్తే జల్‌జీరా తయారైపోతుంది.. దీని తయారీ ఎంత తేలికో, రుచి అంత అమోఘం. ఎండల్లో నోటికి హితవుగా ఉంటుంది. ఈ కాలంలో వచ్చే సాధారణ అనారోగ్యాలను తరిమికొడుతుంది.


సత్తూ షర్బత్‌

ఎండాకాలం చలవచేసే పానీయాల్లో ఇదొకటి. శనగపిండిని వేయించి ఉండలు కట్టకుండా నీళ్లలో కలపాలి. అందులో పుదీన, జీలకర్రల ముద్ద, రెండు పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా నిమ్మరసం, తగినంత ఉప్పు వేస్తే సత్తూ షర్బత్‌ సిద్ధమైపోతుంది. తీపి ఇష్టపడేవారు ఉప్పునకు బదులు పంచదార లేదా బెల్లం వేసుకోవచ్చు.


బార్లీ నీళ్లు: ఏ రుచీ లేని ధాన్యంలో బార్లీ ఒకటి. కానీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచే అమోఘమైన ఔషధం. కుక్కర్‌లో కొన్ని బార్లీ గింజలు వేసి ఎక్కువ నీళ్లు పోసి ఉడికించుకోవాలి. గింజలను వడకట్టేసి ఆ నీళ్లలో కాస్త ఉప్పు, పుదీన, నిమ్మరసం వేసుకుని తాగితే వేడి చేయదు. కిడ్నీ సమస్యలు తలెత్తవు. తీపి కావాలనుకుంటే తేనె వేసుకుని తాగొచ్చు.


పచ్చి మామిడి రసం: మామిడిపండ్ల రసాన్ని ఇష్టపడని వాళ్లుంటారా? పంచదార వేయకుండానే తియ్యగా ఉంటుంది. కానీ తరచూ తాగితే వేడిచేస్తుంది. సెగ్గడ్డలు వచ్చే ప్రమాదమూ ఉంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఇది ప్రయత్నించండి.. పచ్చి మామిడికాయలు ఉడికించి గుజ్జు తీసి నీళ్లతో పల్చగా చేయాలి. అందులో జీలకర్ర, ఏలకులు, పుదీన గ్రైండ్‌ చేసి కలపాలి. తీపి ఇష్టపడితే పంచదార లేదంటే కాస్త ఉప్పు వేయాలి. ఇది చల్లగా, రుచిగా ఉండటమే కాదు, వడదెబ్బ తగలదు. కొందరు మామిడికాయను ఉడికించడానికి బదులు నిప్పు మీద కాల్చి చేస్తారు. ఇది కూడా భిన్నమైన రుచితో అలరిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్