అనామిక... తొలి మహిళా హెలికాప్టర్‌ పైలట్‌!

అమ్మాయిలు ఆంక్షల సంకెళ్లు దాటి అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా దేశ రక్షణ వ్యవస్థలో భాగమైన త్రివిధ దళాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ఆ మధ్య అవనీ చతుర్వేది ఒంటరిగా యుద్ధవిమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.

Updated : 12 Jun 2024 13:05 IST

అమ్మాయిలు ఆంక్షల సంకెళ్లు దాటి అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా దేశ రక్షణ వ్యవస్థలో భాగమైన త్రివిధ దళాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ఆ మధ్య అవనీ చతుర్వేది ఒంటరిగా యుద్ధవిమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. తాజాగా ఐఎన్‌ఎస్‌ రాజాలి హెలికాప్టర్‌ ట్రైనింగ్‌ స్కూల్లో శిక్షణ పొందిన అనామిక బీ రాజీవ్‌ అరుదైన ఘనతను సాధించారు. తమిళనాడు అరక్కోణంలోని నౌకాదళ ఎయిర్‌ స్టేషన్‌లో జరిగిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో సబ్‌-లెఫ్టినెంట్‌ హోదాలో ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్‌ వింగ్స్‌’ను అందుకున్నారు. అనంతరం భారత నౌకాదళంలో మెదటి మహిళా హెలికాప్టర్‌ పైలట్‌గా నియమితులయ్యారు. దీంతో అనామిక... సీ కింగ్స్, ఏఎల్‌హెచ్‌ ధ్రువ్స్, చేతక్స్, ఎంహెచ్‌-60ఆర్‌ వంటి హెలికాప్టర్‌లు నడపడానికి అర్హత సాధించిన మొదటి అమ్మాయి. ఈ విమానాలు యాంటీ పైరసీ, సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ, నిఘా కోసం వాడతారు. ఇందుకోసం ఆమె 22 వారాల కఠిన శిక్షణ పూర్తి చేసుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్