Updated : 15/03/2023 08:02 IST

Surekha Yadav: ఆ వేగం ఆమెకు తల వంచింది

తొలి అడుగు

గవాళ్లకి మాత్రమే సాధ్యం అనుకొన్న రంగంలో మూడు దశాబ్దాల క్రితమే అడుగుపెట్టి.. ఆసియాలోనే మొదటి మహిళా రైలు డ్రైవర్‌గా గుర్తింపుని సాధించారు సురేఖాయాదవ్‌. అది మొదలు ఎంతోమంది మహిళలకి ఈ రంగంలో స్ఫూర్తినిచ్చిన ఆమె, వేగానికి పెట్టిందిపేరైన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ని నడిపి మరో రికార్డు సొంతం చేసుకున్నారు. ఆ ఘనత సాధించిన తొలి మహిళా లోకోపైలట్‌గా నారీశక్తిని చాటి చరిత్ర సృష్టించారు. మహారాష్ట్రలోని సతారా సురేఖ స్వస్థలం. 1988లో మొదటిసారి రైలుని నడిపి జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులని అందుకున్నారు. ప్రస్తుతం... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తున్న వందేభారత్‌ని కూడా అంతే చాకచక్యంతో నడిపి అందరితోనూ ప్రశంస లందుకున్నారామె.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని