శక్తి ఉంటేనే సాధించగలరు!

అమ్మాయిలే కాదు అమ్మలూ... సరైన పోషకాహారం తీసుకునే విషయంలో ఒకింత వెనకే ఉంటున్నారంటున్నాయి సర్వేలు.

Updated : 29 Dec 2022 00:22 IST

అమ్మాయిలే కాదు అమ్మలూ... సరైన పోషకాహారం తీసుకునే విషయంలో ఒకింత వెనకే ఉంటున్నారంటున్నాయి సర్వేలు.  రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే శరీరానికి సమతులాహారం అందాలంటారు పోషకాహార నిపుణులు...

అల్పాహారం కాస్త ఎక్కువైనా తప్పులేదు. నూనెలేని ఇడ్లీ, దోశ వంటివి ఏవైనా ఓకే. అయితే దాంతో పాటు రెండు చొప్పున ఖర్జూరాలూ, గుడ్లూ తీసుకోండి. ఓ గ్లాసు పాలు తాగేయండి. ఇవి రోజంతా చురుగ్గా ఉండటానికి కావలసిన పోషకాల్ని అందిస్తాయి.

* మధ్యాహ్నం భోజనంలో సాధ్యమైనంతవరకూ ఆకుకూరలు, కాయగూరలు,  బఠాణీలూ, బీన్స్‌, పుట్టగొడుగులూ, పప్పు ధాన్యాలూ గుడ్లూ, చేపలూ, చికెన్‌ వంటివి ఉండేలా చూడొచ్చు. అయితే ఒకే తరహా ఆహారాన్ని రోజూ తినే పద్ధతి వద్దు. ఒక్కో రకం పదార్థం నుంచి ఒక్కో పోషకం కీలకంగా ఉండొచ్చు. అందుకే అన్ని రకాలూ...మార్చి మార్చి తీసుకోవాలి. రోజూ ఓ కప్పు పెరుగు తినడం మాత్రం మరిచిపోవద్దు. అప్పుడే పోషకాహార లేమి ఉండదు. జీవక్రియల పనితీరూ మెరుగుపడుతుంది.

* మధ్నాహ్న భోజనమయ్యాక సాయంత్రం ఆకలి పిలుస్తూ ఉంటుంది. ఆ సమయంలో నాలుగైదు బాదం గింజలూ, మొక్కజొన్న, పండ్ల ముక్కలూ, చిరుధాన్యాల పిండితో చేసిన మురుకులూ, బెల్లం వేరుశెనగ అచ్చు...వంటివి ఉంటే కడుపూ నిండుతుంది. పోషకాలూ, పీచూ వంటివి శరీరానికి అందుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్