ఈ సమస్యలకు విరుగుడు.. కొబ్బరి నీళ్లు!

వేసవి తాపాన్ని తీర్చే పదార్థాల్లో కొబ్బరి నీళ్లు ముందు వరుసలో ఉంటాయి. అనేక పోషకాలు మిళితమై ఉన్న వీటి వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

Published : 16 Apr 2024 21:19 IST

వేసవి తాపాన్ని తీర్చే పదార్థాల్లో కొబ్బరి నీళ్లు ముందు వరుసలో ఉంటాయి. అనేక పోషకాలు మిళితమై ఉన్న వీటి వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

⚛ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు.. ఇది శరీరంలోని చక్కెర స్థాయుల్ని కూడా అదుపులో ఉంచుతుంది.

⚛ అధిక బరువుతో సతమతమవుతున్నారా? అయితే కొబ్బరి నీళ్లను ఆహారంలో భాగం చేసుకోండి. ఎందుకంటే దీనిలో తక్కువ మొత్తంలో కొవ్వులు ఉండటం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు.

⚛ కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి.. వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.

⚛ చాలామందికి ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారం త్వరగా జీర్ణం కాకపోవడం, మలబద్ధకం మొదలైన సమస్యలు ఎదురవుతాయి. వీటిని తగ్గించుకోవాలంటే కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అలాగే కొబ్బరి నీళ్లలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా తయారవుతాయి.

⚛ మూత్రపిండాల సంబంధిత సమస్యతో బాధపడే వారికి కొబ్బరి నీళ్లు మంచి ఔషధం. ఇందుకు దీనిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం.. వంటి ఖనిజాలే కారణం!

⚛ కొబ్బరి నీళ్లలో ఎక్కువ మొత్తంలో ఉండే పోషకాల వల్ల శరీరానికి అధిక శక్తి అందుతుంది. ఈ నీటిలో సోడియం, చక్కెరలు తక్కువగా.. క్లోరైడ్, క్యాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల శరీరం హైడ్రేట్ అవడమే కాకుండా పునరుత్తేజితమవుతుంది.

⚛ కండరాల తిమ్మిరి సమస్యతో బాధపడే వారు కొబ్బరి నీళ్లు తాగితే ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనికి కారణం.. కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో ఉండే పొటాషియమే!

⚛ రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాళ్లు, చేతుల వాపును తగ్గిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్