Published : 27/12/2022 00:22 IST

జంటగా రాసేయండి!

చర్మ అవసరాలను బట్టి విటమిన్‌ సి, రెటినాల్‌, సాల్సిలిక్‌ యాసిడ్‌ అంటూ ఉత్పత్తులను ఎంచుకుంటాం. కొందరు ఫేస్‌వాష్‌ దగ్గర్నుంచి సన్‌స్క్రీన్‌ వరకూ అదే శ్రేణిలో కొంటుంటారు. ఒక్కదానికే ఎందుకు పరిమితమవడం.. వేరే వాటితో కలిపి రాయండి.. లాభాలు రెట్టింపు అవుతాయంటున్నారు నిపుణులు.

సికి జతగా ఇ: స్కిన్‌కేర్‌లో విటమిన్‌ సికి ప్రాధాన్యమెక్కువ. చర్మాన్ని మెరిపిస్తూనే మచ్చలను దూరం చేస్తుంది. దానికి ‘ఇ’ని జతచేస్తే తేమ అందించడంతోపాటు చర్మసమస్యలనూ దరి చేరనివ్వదు.

సాల్సిలిక్‌ ఆసిడ్‌తో నియాసినమైడ్‌: విటమిన్‌ బి3.. అదేనండీ నియాసినమైడ్‌.. యాక్నే, చర్మంపై ముడతలకు వ్యతిరేకంగా పని చేస్తుంది. దానికి సాల్సిలిక్‌ యాసిడ్‌ను కలిపితే పెద్ద మొటిమలకూ చెక్‌ పెట్టేయొచ్చు. ఇన్‌ఫ్లమేషన్‌ కూడా దరిచేరదు.

విటమిన్‌ సి+ సన్‌స్క్రీన్‌: విటమిన్‌ సి క్రీమ్‌, ఎస్‌పీఎఫ్‌ 50 ఉన్న సన్‌స్క్రీన్‌ జోడించి లేదా రెండూ కలిపి ఉన్న క్రీమ్‌ రాసుకొని చూడండి. చర్మానికి ఎండ నుంచే కాదు.. ఫ్రీరాడికల్స్‌ నుంచీ రక్షణ లభిస్తుంది.

టీట్రీ ఆయిల్‌కు హైలురోనిక్‌ యాసిడ్‌: మొటిమల సమస్యకు టీట్రీ ఆయిల్‌ మంచి పరిష్కారం. దానికి హైలురోనిక్‌ యాసిడ్‌ను జత చేస్తే సమస్య తగ్గడమే కాదు.. అదుపులోనూ ఉంటుంది. అదనంగా చర్మం ఆరోగ్యంగా కనిపించేలానూ చేస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని