చర్మాన్ని సంరక్షించే మాస్క్!

బొగ్గు పొడితో (యాక్టివేటెడ్‌ చార్‌కోల్) తయారుచేసిన కొన్ని పూతలు చర్మాన్ని తాజాగా ఉంచుతాయంటున్నారు నిపుణులు.

Published : 05 Nov 2023 13:58 IST

బొగ్గు పొడితో (యాక్టివేటెడ్‌ చార్‌కోల్) తయారుచేసిన కొన్ని పూతలు చర్మాన్ని తాజాగా ఉంచుతాయంటున్నారు నిపుణులు.

కాలమేదైనా చాలామందిని జిడ్డు చర్మం ఇబ్బంది పెడుతుంటుంది. ఇలాంటి వారు యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌తో తయారుచేసిన మాస్క్‌ క్లెన్సర్‌ని వాడితే అతిగా విడుదలయ్యే నూనెలు తొలగిపోతాయి. చర్మం మృదువుగానూ మారుతుంది. అలాగే ఈ మాస్క్‌ క్లెన్సర్‌ చర్మం సహజ నూనెల్ని కోల్పోకుండా చేస్తుంది.

వాతావరణంలో ఉండే దుమ్మూ-ధూళి చర్మంపై చేరడం వల్ల స్వేద రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కొద్దిగా బొగ్గుపొడి కలిసిన ఫేస్ మాస్క్ ఉపయోగిస్తే అది మృతకణాలను తొలగిస్తుంది. మురికి బయటకు వచ్చేలా చేస్తుంది.

అయితే ఈ మాస్కులు వాడే విషయంలో వ్యక్తిగత సౌందర్య నిపుణుల సలహా మేరకు చర్మతత్వాన్ని బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్