చర్మ సౌందర్యానికీ ‘గుడ్డు’..!

గుడ్డు సంపూర్ణ పోషకాహారమనే విషయం తెలిసిందే. ఇందులో ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలూ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ సంపూర్ణ ఆరోగ్యానికే కాదు.. అందానికీ ఎంతో మేలు చేస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు.

Published : 09 May 2024 21:31 IST

గుడ్డు సంపూర్ణ పోషకాహారమనే విషయం తెలిసిందే. ఇందులో ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలూ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ సంపూర్ణ ఆరోగ్యానికే కాదు.. అందానికీ ఎంతో మేలు చేస్తాయంటున్నారు సౌందర్య నిపుణులు.

⚛ గుడ్డులోని తెల్లసొనను ముఖంపై పూతలా వేయడం వల్ల వయసు పెరిగే కొద్దీ ముఖంపై వచ్చే ముడతలు, సన్నటి గీతలు రాకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. వారంలో రెండుసార్లు ఈ పూత వేసుకోవడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు.

⚛ కళ్ల కింద వాపును తగ్గించాలంటే గుడ్డులోని తెల్ల సొనతో కంటి కింది భాగాన్ని నెమ్మదిగా మర్దన చేయాలి. అలా కాసేపు ఉంచి చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఆ తర్వాత అక్కడ కొబ్బరినూనె రాయాలి. ఇలా తరచూ చేయడం వల్ల కంటి కింది వాపు క్రమంగా తగ్గుతుంది.

⚛ గుడ్డులోని తెల్లసొనలో రెండుమూడు చుక్కల టీట్రీ ఆయిల్‌ వేసి మొటిమలు ఉన్న ప్రాంతంలో నెమ్మదిగా రాయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, వాటివల్ల వచ్చే మచ్చలు తగ్గిపోతాయి. అంతేకాదు జిడ్డు చర్మం ఉన్న వారు ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు అదుపులో ఉంటుంది.

⚛ ముందుగా గోరువెచ్చటి నీటితో ముఖం కడుక్కొని తెల్లసొన రాయాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మరంధ్రాలు శుభ్రపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్