మెరిసే చర్మం కోసం.. చెరకు రసం!

ఎండగా ఉన్నప్పుడు రోడ్డు పక్కన కనిపించే చెరకు రసం బండిని చూస్తే అమృతం దొరికినంత ఆనందమేస్తుంది. కాస్తంత అల్లం, నిమ్మరసం తగిలించిన తాజా చెరకు రసం తాగితే అలసట, నీరసం మాయమై శరీరం శక్తిని పుంజుకుంటుంది.

Published : 29 Feb 2024 13:18 IST

ఎండగా ఉన్నప్పుడు రోడ్డు పక్కన కనిపించే చెరకు రసం బండిని చూస్తే అమృతం దొరికినంత ఆనందమేస్తుంది. కాస్తంత అల్లం, నిమ్మరసం తగిలించిన తాజా చెరకు రసం తాగితే అలసట, నీరసం మాయమై శరీరం శక్తిని పుంజుకుంటుంది. ఇలా ఆరోగ్యానికే కాదు.. అందానికి, కేశ సౌందర్యానికి కూడా ఈ రసం మేలు చేస్తుందంటున్నారు సౌందర్య నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..

చెరకు రసంతో చర్మకాంతి..

చెరకురసంలో ముల్తానీ మట్టిని కలిపి పేస్ట్‌లా చేసుకుని ముఖానికి పట్టిస్తే చర్మంపై ఉన్న నల్లమచ్చలు తొలగిపోతాయి. ఇందులో ఉండే సమ్మేళనాలు చర్మకణాలను పునరుత్తేజితం చేస్తాయి.

చెరకు రసంలో తేనె కలిపి పావుగంట పాటు చర్మానికి మర్దన చేయాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.

కాఫీపొడికి కాస్త చెరకురసాన్ని చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే చర్మం కాంతులీనుతుంది.

నిమ్మరసం, యాపిల్ జ్యూస్, ద్రాక్ష రసం, కొబ్బరి పాలు, చెరకు రసం.. వీటన్నింటినీ సమపాళ్లలో తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోయి మేనికి మెరుపు వస్తుంది.

చర్మాన్ని యవ్వనంగా, బిగుతుగా ఉంచడానికి మామూలు ఐస్‌క్యూబ్‌ల కన్నా చెరకు రసంతో తయారు చేసుకున్న ఐస్ క్యూబ్‌లను వాడితే రెట్టింపు ఫలితాలుంటాయి.

బొప్పాయి గుజ్జులో చెరకు రసాన్ని కలిపి పట్టించడం వల్ల చర్మం బిగుతుగా తయారవుతుంది.

నాలుగు చెంచాల చెరకు రసానికి రెండు చెంచాల నెయ్యి చేర్చి, చర్మానికి మర్దన చేస్తే ఎండ వల్ల కమిలిన చర్మం తిరిగి కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.

లీటరు నీటిలో గుప్పెడు పుదీనా ఆకులు, పావు లీటరు చెరకు రసం కలిపి, మరిగించి ఆవిరి పట్టుకుంటే చర్మం తేటగా తయారవుతుంది.

ఎటువంటి పదార్థాలూ కలపకుండా ప్యూర్‌ చెరకు రసాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి పట్టిస్తే చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది.

కురులకు కొత్త కళ..

ప్రతిరోజూ చెరకు రసం తాగడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

చెరకు రసాన్ని కుదుళ్లకు పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే పొడిబారిన జుట్టు తిరిగి పట్టులా మెరుస్తుంది.

చెరకు రసం జుట్టుకు సహజమైన కండిషనర్‌గా ఉపయోగపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్