పెళ్లికి ముందు.. ఈ పొరపాట్లు వద్దు..!
పెళ్లంటే చాలు.. ఎంచుకునే దుస్తుల దగ్గర్నుంచి యాక్సెసరీస్ దాకా ప్రతిదీ అందరికంటే భిన్నంగా, సరికొత్తగా ఉండాలని అనుకోవడం సహజం. ఇక అందం విషయంలో అయితే ఏమాత్రం రాజీపడే సమస్యే లేదంటున్నారు ఈ తరం అమ్మాయిలు! ఈ క్రమంలోనే పెళ్లికి ముందు బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి....
పెళ్లంటే చాలు.. ఎంచుకునే దుస్తుల దగ్గర్నుంచి యాక్సెసరీస్ దాకా ప్రతిదీ అందరికంటే భిన్నంగా, సరికొత్తగా ఉండాలని అనుకోవడం సహజం. ఇక అందం విషయంలో అయితే ఏమాత్రం రాజీపడే సమస్యే లేదంటున్నారు ఈ తరం అమ్మాయిలు! ఈ క్రమంలోనే పెళ్లికి ముందు బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి ఫేషియల్స్, మానిక్యూర్, పెడిక్యూర్.. వంటి సౌందర్య చికిత్సలు చేయించుకుంటున్నారు. ఇక కొంతమందైతే పెళ్లిలో మరింత అందంగా కనిపించాలన్న ఉద్దేశంతో రెండు మూడు రోజుల ముందు నుంచే కొత్త కొత్త బ్యూటీ ఉత్పత్తుల్ని వాడడం, స్టైలిష్ హెయిర్‌కట్స్ చేయించుకోవడం లేదంటే ఉన్న జుట్టుతోనే ఏవేవో హెయిర్ స్టైల్స్ ప్రయత్నించడం.. వంటివి చేస్తుంటారు. అయితే వివాహానికి ముందు ఇలా సరికొత్త ప్రయోగాలు చేయడం వల్ల అవి వికటించి పలు సౌందర్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి బ్రైడల్ లుక్ విషయంలో ముందు నుంచే ప్రణాళిక వేసుకోవడం మంచిదంటున్నారు. మరి, ఇంతకీ పెళ్లిలో అందంగా మెరిసిపోవాలన్న ఉద్దేశంతో చాలామంది అమ్మాయిలు చేసే ఆ పొరపాట్లేంటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? రండి.. తెలుసుకుందాం..!
కొత్త ఉత్పత్తులు అసలే వద్దు!
అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి అటు సహజసిద్ధమైన పదార్థాలతో పాటు ఇటు బయట దొరికే క్రీమ్‌లు, మేకప్ ఉత్పత్తులు బోలెడన్ని అందుబాటులో ఉన్నాయి. అయితే తక్షణమే మెరిసిపోవాలన్న ఉద్దేశంతోనో లేదంటే స్నేహితులు సలహా ఇచ్చారనో.. కొంతమంది పెళ్లికి నాలుగైదు రోజుల ముందు నుంచీ కొత్త సౌందర్య ఉత్పత్తులు వాడడం, తాము తరచూ వాడే బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్ మేకప్ ఉత్పత్తుల్ని ప్రయత్నించడం.. వంటివి చేస్తుంటారు. తద్వారా ఆ ఉత్పత్తులు మీ చర్మానికి పడచ్చు.. పడకపోవచ్చు! సున్నితమైన చర్మం ఉన్న వారికి ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. ఒకవేళ ఈ కొత్త ఉత్పత్తులు చర్మానికి సరిపడకపోతే మొటిమలు రావడం, మచ్చలు పడడం, ఎరుపెక్కడం.. మొదలైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పెళ్లికి నెల లేదా రెండు నెలల ముందు నుంచే ఇలాంటి ప్రయోగాలు చేయడం మానుకోవాలి. అలాగే ఒకవేళ మీకు మేకప్ అప్పటిదాకా అలవాటు లేదనుకోండి.. మేకప్ ఉత్పత్తులు వాడి సమస్య కొని తెచ్చుకునే కంటే మేకప్-ఫ్రీ లుక్‌తోనే అందంగా మెరిసిపోవచ్చు!
వ్యాక్సింగ్ విషయంలో..
పెళ్లిలో అందంగా మెరిసిపోవాలనే ఉద్దేశంతో చేతులు, కాళ్లపై ఉండే అవాంఛిత రోమాల్ని తొలగించుకుంటుంటారు చాలామంది అమ్మాయిలు. అయితే అప్పటిదాకా ఈ అలవాటు లేని వాళ్లు సైతం పెళ్లికి నాలుగైదు రోజులు ఉందనగా ఈ ప్రయోగం చేస్తుంటారు. అయితే ఇలా మొదటిసారి వ్యాక్సింగ్ చేసుకోవడం వల్ల చర్మంపై నొప్పి పుడుతుంది.. ఇందుకోసం వాడే క్రీమ్స్ కూడా చర్మానికి పడచ్చు పడకపోవచ్చు.. తద్వారా చర్మంపై అలర్జీ, వాపు.. వంటివి రావచ్చు. కాబట్టి ముందు నుంచీ అలవాటున్న వారు తప్ప పెళ్లికి ముందు వ్యాక్సింగ్ విషయంలో ప్రయోగాలు చేయకపోవడమే మంచిది. ఒకవేళ అంతగా అవాంఛిత రోమాలు తొలగించుకోవాలనుకుంటే మాత్రం ఓసారి నిపుణుల సలహా తీసుకుంటే మంచిది.
జుట్టుతో ప్రయోగాలు వద్దు!
వివాహ ముహూర్తం నిశ్చయమైన క్షణం నుంచి అలా రడీ కావాలి.. ఇలాంటి హెయిర్‌స్టైల్ వేసుకోవాలి అని కలలు కంటుంటారు అమ్మాయిలు. ఈ క్రమంలో యూట్యూబ్ వీడియోలు కూడా చూస్తుంటారు. అయితే ఎవరో కొత్త కొత్త హెయిర్‌స్టైల్ ప్రయత్నించినంత మాత్రాన అది మీకు నప్పచ్చు.. నప్పకపోవచ్చు..! పైగా అలాంటి హెయిర్‌స్టైల్ మీరూ వేసుకోవాలని పెళ్లికి ముందు మీ జుట్టును ఇష్టమొచ్చినట్లుగా కట్ చేయించుకుంటే మీ లుక్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి జుట్టు కత్తిరించుకోకుండానే మీ బ్రైడల్ లుక్‌కి సరిపోయేలా ఉండే చక్కటి హెయిర్‌స్టైల్‌ని ఎంచుకోవచ్చు. హెయిర్ స్టైలిస్ట్‌ని సంప్రదిస్తే మీ లుక్‌కి సరిపోయే హెయిర్‌స్టైల్ ఏంటో వాళ్లే సూచిస్తారు.
తిండిని నిర్లక్ష్యం చేయద్దు!
పెళ్లంటే షాపింగ్‌లని, బ్లౌజులు కుట్టించుకోవాలని.. ఇలా వివిధ రకాల పనులతో తీరిక లేకుండా సమయం గడుపుతుంటారు అమ్మాయిలు. ఈ క్రమంలో తిండి తినడం, నీళ్లు తాగడానికి కూడా వారికి తీరిక దొరకదు. ఇక తమ పెళ్లి ఊహల్లో పడిపోయి నిద్ర కూడా కరువవుతుంటుంది కొంతమంది అమ్మాయిలకు! అయితే ఇలా సరైన ఆహారం తీసుకోకుండా, నీళ్లు తాగకుండా, నిద్ర పోకుండా ఉంటే దాని ప్రభావం అందం మీద కూడా పడుతుంది. తద్వారా ముఖంలో కళ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత పెళ్లి హడావిడిలో ఉన్నప్పటికీ వేళకు భోజనం చేయడం, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది.. అలాగే వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలో ఫ్రీరాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని మెరిపించడంలో సహకరిస్తాయి. ఇక తగినన్ని నీళ్లు తాగడం, 8 గంటల పాటు ప్రశాంతంగా నిద్ర పోవడం వల్ల పెళ్లి నాటికి పుత్తడి బొమ్మలా తళుకులీనచ్చు.
ఇవి గుర్తుపెట్టుకోండి!
⚛ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మంపై ఎక్కడో ఒక దగ్గర చిన్న మొటిమైనా వస్తుంటుంది. అలాగని పెళ్లికి ముందు రోజుల్లో దాన్ని గిల్లితే.. సమస్య మరింత పెద్దదవుతుంది. అక్కడ చర్మంపై వాపు, నల్లబడడం, ఎరుపెక్కడంతో అందవిహీనంగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మొటిమల్ని తక్షణమే తొలగించుకోవడానికి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవచ్చు.
⚛ కొంతమంది పెళ్లికి రెండు రోజులుందనగా లేదంటే సమయం లేక పెళ్లికి ముందు రోజు ఫేషియల్స్ చేయించుకుంటుంటారు. కానీ దీనివల్ల ఎలాంటి ఫలితం కనిపించదు. అందుకే పెళ్లికి కనీసం ఐదారు రోజులు ముందే ఫేషియల్స్ చేయించుకుంటే పెళ్లి నాటికి ముఖం మరింత ప్రకాశవంతంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- ఎండల్లోనూ... తాజాగా
- మంత్రముగ్ధుల్ని చేసేస్తున్నాయి...
- Samantha: పెళ్లి గౌనుని రీసైక్లింగ్ చేయించా.. ఇదంటే ఎంతో ఇష్టం!
- Asoka Makeup Trend: అప్పటి కరీనా లుక్‌ని ఇలా రీక్రియేట్ చేస్తున్నారు!
- ధవళవర్ణంలో దేవకన్యలా..!
ఆరోగ్యమస్తు
- డిప్రెషన్ తగ్గించే పాదాంగుష్ఠాసనం
- ఎలా తింటున్నారు
- పగలు నిద్రపోతున్నారా?
- నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా?
- వీటితో.. కడుపు చల్లగా.. ఆరోగ్యంగా..!
అనుబంధం
- పాట్లక్తో...
- నాన్నంటే భయపడుతున్నారు..!
- ప్రయోగాలతో నేర్పిద్దామా?
- పెంపకం బట్టి ఎదుగుతారు.!
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
యూత్ కార్నర్
- పేదరికాన్ని దాటి... చదువుల్లో మెరిసి!
- Mrunal Thakur: అప్పుడే పెళ్లి చేసుకుంటా.. భవిష్యత్తులో నేనూ దీనికి రడీ!
- టీనాతో ఇంటర్వ్యూకి సిద్ధమా?!
- రాయల్ సొసైటీలో మన స్వెత్లానా!
- వేసవి కథ!
'స్వీట్' హోం
- ఫర్నిచర్‌పై మరకలు పోవాలంటే..!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
వర్క్ & లైఫ్
- అక్కడ బిడ్డను కంటే రూ. 60 లక్షల బహుమతి!
- థైరాయిడ్‌తో బరువు పెరిగా...
- పట్టు చిక్కాలంటే... ప్రణాళిక ఉండాలి...
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!