Beauty tips: ముఖానికి.. మట్టి!

ఈ తరం అమ్మాయిలను ఆకర్షిస్తున్న వాటిల్లో మట్టి.. ‘క్లే/ మడ్‌’ మాస్క్‌లు ఒకటి. ముఖాన్ని మెరిపించడమే కాదు.. యాక్నే, ముడతలు, గీతలను తొలగించడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు వీటితో సొంతం. అవేంటంటే...

Published : 26 May 2023 00:01 IST

ఈ తరం అమ్మాయిలను ఆకర్షిస్తున్న వాటిల్లో మట్టి.. ‘క్లే/ మడ్‌’ మాస్క్‌లు ఒకటి. ముఖాన్ని మెరిపించడమే కాదు.. యాక్నే, ముడతలు, గీతలను తొలగించడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు వీటితో సొంతం. అవేంటంటే...

* బెంటోనైట్‌.. అగ్నిపర్వతాలు పేలడం ద్వారా ఏర్పడిన బూడిదతో దీన్ని తయారు చేస్తారట. చర్మరంధ్రాల్లో లోతుగా పేరుకొన్న మురికి, నూనెలను తొలగిస్తుంది. సోడియం, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్‌ గుణాలు చర్మానికి మేలు చేస్తాయి. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు యాక్నేని దూరం చేస్తాయి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి ఇది ఉత్తమ ఎంపిక.

* కాలిన్‌ క్లే.. సెన్సిటివ్‌, పొడిచర్మ తత్వాలతోపాటు యాక్నే ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు. చర్మరంధ్రాల లోపలి నుంచి శుభ్రం చేయడమే కాదు.. చర్మంపై ముడతలు, గీతల్నీ తగ్గిస్తుంది.

* ఆస్ట్రేలియన్‌ పింక్‌ క్లే.. సిలికా, మెగ్నీషియం, సెలెనియం, జింక్‌ గుణాలెక్కువ. అన్ని చర్మతత్వాలవారికీ మేలే. చర్మాన్ని బిగుతుగా మార్చే పిగ్మెంటేషన్‌, ఇన్‌ఫ్లమేషన్లను తగ్గిస్తుంది. ఛాయనూ మెరుగుపరుస్తుంది.

* సీ క్లే.. దీన్నే ఫ్రెంచ్‌ గ్రీన్‌ క్లేగానూ పిలుస్తారు. ఆకుపచ్చ రంగులో ఉండే దీన్నుంచి ఐరన్‌ ఆక్సైడ్స్‌, మెగ్నీషియం, క్యాల్షియం, కాపర్‌ వంటి మినరల్స్‌ కూడా అందుతాయి. మొటిమలే కాదు వాటి తాలూకు మచ్చల్నీ దూరం చేయగలదు. ఆయిల్‌, సెన్సిటివ్‌ స్కిన్‌ వారికిది ఉత్తమ ఎంపిక.

* ఫుల్లర్స్‌ ఎర్త్‌.. దీనికే ముల్తానీ మట్టిగా పేరు. చర్మానికి లోతైన శుభ్రతనిస్తూనే మచ్చలను తొలగించడంలోనూ సాయపడుతుంది. నూనె చర్మతత్వం, పిగ్మెంటేషన్‌ ఉన్నవారు దీన్ని ఎంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్