Green Juice: అజీర్తికి.. ఆకుపచ్చ జ్యూస్..
సాధారణంగా మనలో చాలామందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అలా కాకుండా ఈ గ్రీన్ జ్యూస్‌ను అలవాటు చేసుకోండి. శరీరాన్ని డీటాక్స్ చేయటమే కాక జీర్ణ ప్రక్రియనూ మెరుగుపరుస్తుంది అంటున్నారు నిపుణులు.
సాధారణంగా మనలో చాలామందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అలా కాకుండా ఈ గ్రీన్ జ్యూస్‌ను అలవాటు చేసుకోండి. శరీరాన్ని డీటాక్స్ చేయటమే కాక జీర్ణ ప్రక్రియనూ మెరుగుపరుస్తుంది అంటున్నారు నిపుణులు..
* సగం ఆకుపచ్చ ఆపిల్‌ను తీసుకొని ముక్కలుగా కోసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అందులో కొంచెం పుదీనా, కొన్ని పాలకూర ఆకులు, సగం కీరదోస వేసి మిక్సీ పట్టాలి. చివరగా అందులో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే సరి. ఈ తాజా రసాన్ని వెంటనే తాగేయాలి.
* జీర్ణశక్తి తక్కువగా ఉన్నా, లేదా బరువు తగ్గాలనుకుంటున్నా ఈ గ్రీన్ జ్యూస్‌ను రోజూ ఉదయం తీసుకోండి. ఇందులో ఉండే ప్రీ బయాటిక్స్ మంచి బ్యాక్టీరియాను వృద్ధిచేసి మలబద్ధకం, అధిక బరువునూ తగ్గిస్తాయి. తద్వారా శరీరంలో రోగనిరోధకతా పెరుగుతుంది. అయితే దీన్ని గ్లాసుకు మించకుండా తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.