తేగలే కదా అని తీసి పారేయకండి!

ఈ కాలంలో విరివిగా దొరికే తేగలను ఇష్టపడని వారుండరు. ఎలాంటి రసాయనాలూ, ఎరువులూ వాడకుండానే మొలకెత్తే ఇవి రుచిలో అమోఘం. ఇందులో పోషకాలూ పుష్కలం.

Published : 04 Jan 2023 00:48 IST

ఈ కాలంలో విరివిగా దొరికే తేగలను ఇష్టపడని వారుండరు. ఎలాంటి రసాయనాలూ, ఎరువులూ వాడకుండానే మొలకెత్తే ఇవి రుచిలో అమోఘం. ఇందులో పోషకాలూ పుష్కలం.

* తేగల్లో పొటాషియం, విటమిన్‌ బి1, బి2, బి3, విటమిన్‌ సి  ఉంటాయి. పీచు, క్యాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలూ లభిస్తాయి. పోషకాహార లేమితో బాధ పడేవారు రోజూ కనీసం ఒక తేగ అయినా తింటే సరి. అలానే వీటిల్లో ఉండే పీచు.. జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. పెద్దపేగుల్లో మలినాలు చేరకుండా, టాక్సిన్లను తొలగిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికీ మంచి ఆహారం.

* ఎదిగే పిల్లలు తేగల్ని తింటే... ఇందులోని క్యాల్షియం ఎముక దృఢత్వాన్ని పెంచుతుంది. మహిళల్లో అస్టియో పోరోసిస్‌ సమస్య రాకుండా అడ్డుకుంటుంది.

* తేగలోని యాంటీ ఆక్సిడెంట్లు... తెల్ల రక్తకణాలను పెంచుతాయి. వ్యాధి నిరోధశక్తిని మెరుగుపరుస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బులను దూరం చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్