మెరిసే జుట్టు.. వీటితో సొంతం!

మనం తీసుకునే ఆహారం మన జుట్టు, చర్మం పైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి చర్మం తాజాగా, కాంతివంతంగా ఉండాలన్నా, జుట్టు కుదుళ్లు బలంగా మారాలన్నా పోషకాలున్న పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాల్సిందే. అవేంటో తెలుసుకోండి మరి...

Published : 25 May 2024 19:12 IST

మనం తీసుకునే ఆహారం మన జుట్టు, చర్మం పైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి చర్మం తాజాగా, కాంతివంతంగా ఉండాలన్నా, జుట్టు కుదుళ్లు బలంగా మారాలన్నా పోషకాలున్న పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాల్సిందే. అవేంటో తెలుసుకోండి మరి...

⚛ గుడ్లు, పెరుగులో మాంసకృత్తులు, విటమిన్‌-బి5 పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఈ పోషకాలన్నీ లభిస్తాయి. అంతేకాదు.. మాడుకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుతుంది. జుట్టు రాలడం, పలుచబడడం వంటి సమస్యలు తగ్గుతాయి.

⚛ సాల్మన్‌ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి. మెరిసేలా చేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు పొడిబారకుండా, ఎండిపోయి గడ్డిలా మారకుండా చూస్తాయి.

⚛ దాల్చిన చెక్క రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. కుదుళ్లకు పోషణను చేకూరుస్తుంది. కాబట్టి దాల్చిన చెక్క పొడిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

⚛ పప్పుల్లోని మాంసకృత్తులు, ఇనుము జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.

⚛ చిలగడ దుంపలో విటమిన్‌-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది మాడుపై తైలగ్రంథుల పనితీరును మెరుగుపరుస్తుంది. దాంతో జుట్టు కాంతివంతంగా కనిపిస్తుంది.

⚛ బాదంలో పీచు, మాంసకృత్తులతో పాటు మాంగనీస్‌, సెలీనియం.. వంటి మూలకాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి జుట్టును మెరిపించడంతో పాటు బలంగా మారుస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్