ఫీడింగ్‌ ఇస్తున్నంత కాలం గర్భం రాదా?

మేడమ్‌.. నాకు ఐదు నెలల బాబున్నాడు. ప్రస్తుతం బాబుకి ఫీడింగ్‌ ఇస్తున్నాను. మళ్లీ ఎప్పుడు పిరియడ్స్‌ మొదలవుతాయి? ఇలా నెలసరి మొదలు కాకపోతే నేను గర్భం ధరించే...

Updated : 28 Sep 2022 21:46 IST

మేడమ్‌.. నాకు ఐదు నెలల బాబున్నాడు. ప్రస్తుతం బాబుకి ఫీడింగ్‌ ఇస్తున్నాను. మళ్లీ ఎప్పుడు పిరియడ్స్‌ మొదలవుతాయి? ఇలా నెలసరి మొదలు కాకపోతే నేను గర్భం ధరించే అవకాశమేమైనా ఉందా? దయచేసి చెప్పండి. - ఓ సోదరి

జ. బాబు పూర్తిగా చనుబాల మీదే ఆధారపడి ఉన్నంత కాలం సహజంగా పిరియడ్స్ రావు. ఎప్పుడైతే మీరు పోత పాలు, ఘనాహారం ఇవ్వడం మొదలు పెడతారో అప్పుడు మీ హార్మోన్లు పాల ఉత్పత్తి నుంచి తిరిగి అండం విడుదల వైపుకి మారతాయి. దాంతో నెలసరి తిరిగి మొదలవుతుంది. అయితే పాలు ఇస్తున్నప్పుడు కూడా అరుదుగానే అయినా గర్భం ధరించే అవకాశం ఉంది. అందుకని మీరు ఏదైనా సురక్షితమైన గర్భనిరోధక పద్ధతిని ఎంచుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్