Neha Sharma : నడిచే నెలవంక.. ఆ అందం వెనక..!

ఆమె అందాన్ని చూస్తే ‘నడిచే నెలవంక.. చూస్తే నీవంక.. నిదరే రాదింకా’ అంటూ పాటందుకుంటారు కుర్రకారు. అందంతోనే కాదు.. ‘చిరుత’ సినిమాలో తన అభినయంతోనూ ‘పిచ్చిపిచ్చిగా నచ్చేస్తూ.. గుండెలోతుల్లో గుచ్చేస్తూ’ తెలుగువారికి దగ్గరైంది నేహా శర్మ.

Published : 22 Nov 2023 11:54 IST

(Photos: Instagram)

ఆమె అందాన్ని చూస్తే ‘నడిచే నెలవంక.. చూస్తే నీవంక.. నిదరే రాదింకా’ అంటూ పాటందుకుంటారు కుర్రకారు. అందంతోనే కాదు.. ‘చిరుత’ సినిమాలో తన అభినయంతోనూ ‘పిచ్చిపిచ్చిగా నచ్చేస్తూ.. గుండెలోతుల్లో గుచ్చేస్తూ’ తెలుగువారికి దగ్గరైంది నేహా శర్మ(Neha Sharma). ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ భామ.. సోషల్‌ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌కు ఎప్పుడూ చేరువలోనే ఉంటుంది. వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందానికి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోన్న ఈ చక్కనమ్మ పుట్టినరోజు నేడు! ఈ సందర్భంగా తన అందం వెనకున్న ఆ రహస్యాలేంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..!

మేకప్‌ ఇష్టమే.. కానీ!

అందంగా మెరిసిపోవాలని గంటల తరబడి సమయం వెచ్చిస్తుంటారు కొందరు అమ్మాయిలు. నన్నడిగితే ఆ అవసరం లేదంటా! ఎందుకంటే క్లెన్సింగ్‌, టోనింగ్‌, మాయిశ్చరైజింగ్‌.. ఈ మూడు పద్ధతుల్లో సంపూర్ణ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. నేనూ రోజూ ఇదే రొటీన్‌ని పాటిస్తున్నా. అలాగే అకేషనల్‌గా మేకప్‌ వేసుకోవడానికి ఆసక్తి చూపుతా. అది కూడా తక్కువ మొత్తంలోనే! అయితే రాత్రి ఎంత ఆలస్యమైనా మేకప్‌ తొలగించుకున్నాకే నిద్రపోతా. నీళ్లు ఎక్కువగా తాగడం, దాదాపు ఏడెనిమిది గంటలు నిద్రపోవడం నాకు అలవాటు. నిద్రలోనే మన చర్మ కణాలు రిపేరవుతాయి. అప్పుడే చర్మం పునరుత్తేజితమవుతుంది.

ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌!

అందానికైనా, ఆరోగ్యానికైనా పోషకాహారం తీసుకోవడం తప్పనిసరి! ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే ఇవి ఎక్కువగా లభించే చేపలు, ఇతర సముద్రపు ఆహారాన్ని రోజువారీ డైట్‌లో భాగం చేసుకుంటాను. అలాగే రోజూ 18 గంటలు ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేస్తాను. ఈ క్రమంలో తొలి ఆహారం ఉదయం 11 గంటలకు తీసుకుంటా. అలాగే బ్లాక్‌ కాఫీ, ఉడికించిన కోడిగుడ్లు, అవకాడో, కమలాఫలం రసం.. వంటివి ఎక్కువగా తీసుకుంటా.

జిమ్‌.. నా హ్యాపీ ప్లేస్‌!

ఒక్కొక్కరికీ ఒక్కో హ్యాపీ ప్లేస్‌ ఉంటుంది. నా హ్యాపీ ప్లేస్‌ జిమ్‌. ప్రాథమికంగానే నేను ఫిట్‌నెస్‌ను ఇష్టపడతా! ఈ క్రమంలోనే బరువులెత్తడం, పులప్స్‌, డంబెల్‌ ఎక్సర్‌సైజెస్‌.. వంటివి సాధన చేస్తా.. అలాగే పవర్‌ యోగా, ఫంక్షనల్‌ ట్రైనింగ్‌ కలిపి సాధన చేస్తాను. వారానికి రెండుసార్లు బరువులెత్తడం, రోజు విడిచి రోజు పిలాటిస్‌, వారానికోసారి ఫంక్షనల్‌ వ్యాయామాలు.. ఇలా వారంలో ఏయే వ్యాయామాలు చేయాలో.. ముందే ప్రణాళిక వేసుకుంటా. ఇక వ్యాయామాలు బోర్‌ కొట్టినప్పుడు ఈత, యోగా.. వంటివి ప్రాక్టీస్‌ చేస్తా.. అంతేకానీ వర్కవుట్ రొటీన్‌ని మాత్రం అస్సలు మిస్సవ్వను. ఇక నా జిమ్‌ బడ్డీ నా చెల్లెలు ఐషానే!

డ్యాన్స్‌ లవర్‌ని!

నాకు తెలిసిన వారు నన్ను ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అని పిలుస్తుంటారు. అయితే నా ఫిట్‌నెస్‌లో వ్యాయామాల పాత్ర ఎంత ఉందో.. డ్యాన్స్‌ పాత్ర కూడా అంతే ఉంది. చిన్న వయసు నుంచే డ్యాన్స్‌ అంటే ప్రాణం పెట్టేదాన్ని. ఈ మక్కువతోనే కథక్‌ నేర్చుకున్నా. దీంతో పాటు లండన్‌లో హిప్‌హాప్‌, సాల్సా, జైవ్‌, జాజ్‌.. వంటి పాశ్చాత్య నృత్య రీతుల్లో శిక్షణ తీసుకున్నా.. వ్యాయామాల్లాగే డ్యాన్స్‌నీ రోజూ సాధన చేస్తుంటా. ఇది నా శరీరంలో పేరుకునే కొవ్వులు, క్యాలరీల్ని కరిగించడంలో సహకరిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్