పిల్లల్లో మలబద్ధకమా?

పిల్లల్లో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. ఎంతసేపూ కదలకుండా ఒక దగ్గర కూర్చోవడం, గంటల తరబడి గ్యాడ్జెట్లకు అతుక్కుపోవడం వల్ల స్థూలకాయం వంటి సమస్యలే కాదు.. మలబద్ధకం కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

Published : 14 Jan 2024 13:35 IST

పిల్లల్లో శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. ఎంతసేపూ కదలకుండా ఒక దగ్గర కూర్చోవడం, గంటల తరబడి గ్యాడ్జెట్లకు అతుక్కుపోవడం వల్ల స్థూలకాయం వంటి సమస్యలే కాదు.. మలబద్ధకం కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ప్రస్తుతం చాలామంది చిన్నారుల్లో తలెత్తే ఈ సమస్యకు కారణాలు, వాటి పరిష్కార మార్గాలేంటో తెలుసుకుందాం రండి..

కారణాలివేనా?

పిల్లల్లో మలబద్ధకం సమస్య రావడానికి కొన్ని కారణాలున్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా..

⚛ శారీరక శ్రమ లేకపోవడం/ఆటలాడకపోవడం/ ఎక్కువసేపు కదలకుండా ఒకే చోట కూర్చోవడం..

⚛ నీళ్లు సరిగ్గా తాగకపోవడం, ద్రవ పదార్థాలు తీసుకోకపోవడం..

⚛ జంక్‌ఫుడ్స్‌ ఎక్కువగా తీసుకోవడం

⚛ రాత్రిపూట ఆలస్యంగా తినడం

⚛ అర్ధరాత్రి వరకు మేల్కోవడం

⚛ నిద్రలేమి

⚛ జీవక్రియల పనితీరు మందగించడం..

ఈ చిట్కాలతో మేలు!

⚛ ఉదయం నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు పిల్లలతో తాగించాలి. రుచి కోసం అందులో టీస్పూన్‌ తేనె, నిమ్మరసం కూడా కలిపి అందించచ్చు.

⚛ రాత్రి నీటిలో నానబెట్టిన 4-5 ఎండు ద్రాక్షలను పరగడుపునే తినిపించాలి.

⚛ గోరువెచ్చని పాలలో అరటీస్పూన్‌ ఆవు నెయ్యి కలిపి రాత్రిపూట పడుకునే ముందు పిల్లలకు అందించాలి.

⚛ ఇంగువను పేస్ట్‌లాగా తయారుచేసుకుని పిల్లల బొడ్డు చుట్టూ సవ్యదిశలో రాయాలి. దీనివల్ల వారిలో అజీర్తి సమస్యలేవైనా ఉంటే దూరమవుతాయట!

⚛ పచ్చి ఆహార పదార్థాలను పిల్లలు జీర్ణం చేసుకోలేరు. కాబట్టి వారికి ఉడకబెట్టిన, వండిన ఆహార పదార్థాలనే అందించాలి.

⚛ పిల్లలకు అందించే ఆహార పదార్థాల్లో చక్కెర, ఉప్పు, నూనెల మోతాదును బాగా తగ్గించాలి.

⚛ పీచు పదార్థాలు మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి. అందుకే చిన్నారుల రోజువారీ ఆహారంలో పీచు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఈ క్రమంలో స్ట్రాబెర్రీ, అవకాడో, ఓట్స్‌, యాపిల్‌, నిమ్మజాతి పండ్లు.. వంటివి వారు ఎక్కువగా తినేలా ప్రోత్సహించాలి.

⚛ పిల్లలతో వివిధ రకాల వ్యాయామాలు చేయించడంతో పాటు ఆటలాడేలా వారిని ప్రోత్సహించాలి. నడక, పరుగు, జాగింగ్‌.. వంటివీ మంచివే!

అయితే ఈ చిట్కాలు పాటిస్తున్నా పిల్లల్లో మలబద్ధకం సమస్య తగ్గుముఖం పట్టకపోతే.. పిల్లల వైద్య నిపుణుల్ని సంప్రదించి వారికి తగిన చికిత్స అందించడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్