ఈ పదార్థాలతో.. వేసవిలో చల్లగా..!

వేసవిలో పెరిగే ఉష్ణోగ్రతల వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే ఈ కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. అందుకు కొన్ని ఆహార పదార్థాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

Published : 02 Apr 2024 12:44 IST

వేసవిలో పెరిగే ఉష్ణోగ్రతల వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే ఈ కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. అందుకు కొన్ని ఆహార పదార్థాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఈ క్రమంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎలాంటి పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి..

ఈ పండ్లతో..

వేసవి వేడి నుంచి తట్టుకోవడానికి ఈ కాలంలో వచ్చే కొన్ని పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా తాటి ముంజలు, పుచ్చకాయ, తర్బూజా, వంటి పండ్లు అటు రుచికి రుచితో పాటు శరీరానికి చలువను అందిస్తాయి.

డీహైడ్రేషన్ బారిన పడకుండా..

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం తప్పనిసరి. అయితే నీళ్లతో పాటు నిమ్మరసం, లెమన్‌గ్రాస్ టీ, మిల్క్‌షేక్, కోకమ్ పండుతో చేసిన షర్బత్, గుల్‌కంద్ (గులాబీ ఆకులతో చేసిన స్వీట్), ఆమ్ పన్నా, సత్తు డ్రింక్ (శెనగలు-బెల్లం కలిపి సత్తుపిండితో చేసే పానీయం), అంబలి.. మొదలైనవి తీసుకోవాలి. ఇవి రుచికరంగా ఉండడమే కాదు.. వీటితో శరీరానికి ఎక్కువ మొత్తంలో నీరు కూడా అందుతుంది.

భోజనానికి ఇవి..

డ్రింక్స్, పండ్లే కాదు.. మనం రోజూ రెండు పూటలా తీసుకునే భోజనం విషయంలోనూ పలు మార్పులు-చేర్పులు చేసుకోవాలి. పెరుగన్నం-అప్పడాలు కలిపి తీసుకోవడం, జొన్నల్ని బాగా ఉడికించుకొని సబ్జీ (అన్ని కూరగాయలను కలిపి చేసే కర్రీ)తో కలిపి తినడం, గంజి, పోహా, పెరుగు, అన్నం - మామిడికాయ పచ్చిపులుసు.. ఇలాంటి ఫుడ్ కాంబినేషన్స్‌ని భోజనంలో భాగంగా తీసుకోవాలి. ఫలితంగా ఇవి అధిక వేడి నుంచి శరీరాన్ని కాపాడి శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్