నాకే ఎందుకిలా అనుకున్నా!

అమ్మ నీనాగుప్తా భారతీయురాలు.. నాన్న వివ్‌ రిచర్డ్స్‌ కరేబియన్‌! మామూలు వాళ్లతో పోలిస్తే నల్లగా ఉండేదాన్ని. దీంతో ‘నల్ల పిల్ల’ అంటూ ఏడిపించేవారు.

Published : 02 Jan 2023 00:34 IST

అనుభవ పాఠం

మ్మ నీనాగుప్తా భారతీయురాలు.. నాన్న వివ్‌ రిచర్డ్స్‌ కరేబియన్‌! మామూలు వాళ్లతో పోలిస్తే నల్లగా ఉండేదాన్ని. దీంతో ‘నల్ల పిల్ల’ అంటూ ఏడిపించేవారు. స్నేహితులు అనుకున్నవాళ్లూ ఏం వేసుకోవాలి, కెరియర్‌, ఆటలు వంటి ఏ ప్రస్తావన వచ్చినా నా రంగును ఎత్తి చూపేవారు. దీనికితోడు అమ్మానాన్న విడిపోయారు. దాని మీదా హేళనలే. రోజూ ఇంటికొచ్చి ఏడ్చేదాన్ని. నేనే ఎందుకిలా ఉన్నా? అందరిలా తెల్లగా ఉండొచ్చు కదా అనుకునేదాన్ని. అప్పుడు అమ్మ.. ‘ఇది కొంచమే.. జీవితంలో ఇలాంటివి ఇంకా వస్తాయి. ఇప్పుడు రంగు, ఎత్తు, నీ వ్యక్తిగత జీవితం మీద మాట్లాడుతున్నారు కదా! ఇవి సరిగా ఉన్నంత మాత్రాన అనడం ఆపేస్తారనుకున్నావా? అప్పుడూ ఏదో ఒకటి వెదుకుతారు. ముందు నువ్వు మారు’ అంది. ఆ మాటలు నాపై ప్రభావం చూపాయి. ఆలోచించడం మొదలుపెట్టా. ఎన్నో ప్రదేశాలకు వెళ్లా. ఓసారి ఓ దేశానికెళ్లా. అక్కడ నాలాగే ఉన్నవాళ్లని చూశా. అప్పుడు నేను ఒంటరి కాదన్న విషయం అర్థమయ్యాక ఎంత ఆనందించానో! అందరిలో ఒకరిలా ఉన్నా నా ప్రత్యేకత ఏమీలేదు కదా.. ఈసారి దానిపై దృష్టిపెట్టా. నాకిష్టమైన డిజైనింగ్‌లో రాణించాలనుకున్నా. దేశంలోనే ప్రముఖ డిజైనర్లలో ఒకరిగా నిలిచా. ఇప్పటికీ ‘నల్ల అమ్మాయి’ అనేవారు లేకపోలేదు. ఇప్పుడు బాధపడను. కానీ.. ‘అయితే ఏంట’ని ఎదురు ప్రశ్నిస్తా. ‘ఇంత చిన్నదానికి..’ అని సర్దిచెప్పేవారూ లేకపోలేదు. నిజానికి ఆ మాటిప్పుడు నన్ను బాధపెట్టదు. కానీ అందరూ అలా కాదు. దాన్నో లోపమనుకొని కుంగిపోయే వారున్నారు. అలాంటివాళ్లకు నాలా ఎవరో ఒకరు తోడు నిలవాలన్న కోరిక మాత్రమే! మిమ్మల్ని బాధించేది ఎదురైందనుకోండి.. బాధపడి కూర్చోవద్దు. దాన్ని ప్రశ్నించే స్థాయికి చేరుకోండి. మీ గెలుపు వారికి సమాధానం.

- మసాబా గుప్తా, డిజైనర్‌, నటి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్